బరువు తగ్గడానికి...

ABN , First Publish Date - 2021-09-12T05:30:00+05:30 IST

జీరా వాటర్‌ను తాగడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి డ్రింక్‌. రాత్రి ఒక గ్లాసు నీళ్లలో కొద్దిగా జీలకర్ర వేసి పెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ నీటిని తాగాలి...

బరువు తగ్గడానికి...

జీరా వాటర్‌ను తాగడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి డ్రింక్‌. రాత్రి ఒక గ్లాసు నీళ్లలో కొద్దిగా జీలకర్ర వేసి పెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ నీటిని తాగాలి.


  1. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. జీవక్రియల రేటు మెరుగుపడుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. 
  2. జీలకర్ర నీటిని తాగడం వల్ల ఎసిడిటీ, పొట్ట ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కడుపు నొప్పితో బాధపడుతున్న వారికి ఇది పెయిన్‌ కిల్లర్‌లా పనిచేస్తుంది.
  3. జీలకర్ర ఇన్సులిన్‌ ఉత్పత్తిని స్టిమ్యులేట్‌ చేస్తుంది. శరీరంలో షుగర్‌ లెవెల్స్‌ నియంత్రణలో ఉంచేందుకు సహాయపడుతుంది. అందుకే డయాబెటిస్‌ ఉన్న వారికి పరగడుపున జీలకర్ర నీటిని తాగమని నిపుణులు సూచిస్తుంటారు.
  4. జీరా వాటర్‌లో పొటాషియం పాళ్లు ఎక్కువ. ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలను ఇది నిరోధిస్తుంది. రక్తపోటును నియంత్రించేందుకు సహాయపడుతుంది. 
  5. ఇందులో ఐరన్‌, పీచుపదార్థం పాళ్లు ఎక్కువ. అందుకే ఇమ్యూనిటీ పెంచుకునేందుకు జీలకర్ర నీటిని తీసుకోవాలి. 
  6. జీలకర్ర నీటిలో పొటాషియం, కాల్షియం, సెలీనియం, కాపర్‌, మెగ్నీషియం పాళ్లు ఎక్కువగా ఉంటాయి. చర్మ ఆరోగ్యానికి ఇవి బాగా పనికొస్తాయి.

Updated Date - 2021-09-12T05:30:00+05:30 IST