కుబేరులే టార్గెట్‌గా అమెరికాలో కొత్త చట్టం

ABN , First Publish Date - 2021-03-08T09:12:36+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా ప్రతి దేశంలోనూ సంపద విషయంలో అసమానత అనేది ఏర్పడింది. ఈ

కుబేరులే టార్గెట్‌గా అమెరికాలో కొత్త చట్టం

వాషింగ్టన్: కరోనా మహమ్మారి కారణంగా ప్రతి దేశంలోనూ సంపద విషయంలో అసమానత అనేది ఏర్పడింది. ఈ సంపద అసమానతను తగ్గించేందుకు అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత వారం ‘అల్ట్రా మిలియనీర్ ట్యాక్స్ యాక్ట్’ పేరిట కొత్త చట్టాన్ని సెనెట్‌లో ప్రతిపాదించింది. ఈ చట్టం కింద 50 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉన్నవారు ఏడాదికి మూడు శాతం వార్షిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉన్నవారి నుంచి ప్రభుత్వం మూడు శాతం వార్షిక పన్నును వసూలు చేస్తుంది. అమెరికాలోని లక్ష మంది సంపన్న కుటుంబాలపై ఈ చట్టం ప్రభావం పడనుంది. 


ప్రపంచ కుబేరుల్లో అత్యధికులు అమెరికాలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ చట్టం ద్వారా కుబేరులపై భారీ ప్రభావం పడబోతోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే అమెజాన్ సంస్థల అధినేత జెఫ్ బెజోస్ 5.7 బిలియన్ డాలర్లు, టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఇలాన్ మస్క్ 4.6 బిలియన్ డాలర్లు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ 3.6 బిలియన్ డాలర్లు, ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ 3 బిలియన్ డాలర్లు 2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ చట్టం ద్వారా పదేళ్ల సమయంలో 3 ట్రిలియన్ డాలర్లకు పైగా పన్ను వసూలవుతుందని సెనెటర్లు చెబుతున్నారు. ఈ చట్టం ద్వారా అదనంగా వచ్చే పన్ను చైల్డ్ కేర్, ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితర అవసరాలకు ఉపయోగపడనున్నట్టు చెప్పారు. అత్యంత సంపద కలిగి ఉన్న వారి నుంచి ఎక్కువ పన్ను వసూలు చేయాలని గతంలో బిల్‌గేట్స్ చెప్పిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-03-08T09:12:36+05:30 IST