Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ పరిశ్రమలను అంతరిక్షానికి తరలించాలి: జెఫ్ బెజోస్ కీలక వ్యాఖ్య

వాషింగ్టన్: కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు, భారీ ఫ్యాక్టరీలన్నిటినీ అంతరిక్షానికి తరలించాలని అమెజాన్ సంస్థల అధినేత జెఫ్ బెజోస్ తాజాగా వ్యాఖ్యానించారు. భూమిని రక్షించేందుకు ఇది అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారం తన తొలి అంతరిక్ష యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసిన అనంతరం జెఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. జెఫ్ నేతృత్వంలోని బ్లూ ఆరిజిన్ సంస్థ న్యూ షెపర్డ్ వ్యోమనౌక ద్వారా ఈ యాత్రను నిర్వహించిన విషయం తెలిసిందే. తన సంస్థ చేపట్టిన తొలి యాత్ర‌లో జెఫ్, మరో ముగ్గురితో కలిసి అంతరిక్షానికి వెళ్లొచ్చారు. మానవమనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న వాతావరణ మార్పులను అరికట్టాలనే కోరిక ఈ యాత్రతో మరింత బలపడిందని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘మనం ఓ సుందరమైన గ్రహంలో నివసిస్తున్నాం. కానీ..అంతరిక్షం నుంచి చూస్తే మన వాతావరణం ఎంత పలుచనైందో తెలుస్తుంది. అస్సలు నమ్మశక్యం కానీ దృశ్యం ఇది. కానీ..నేల మీద ఉన్నప్పుడు ఇది ఎంతో పెద్దదిగా అనిపిస్తుంది. ఏం చేసినా చెల్లిపోతుందిలే అనే భావన కలుగుతుంది. కానీ..అంతరిక్షంలోకి వెళ్లాక ఈ ఆలోచన మారిపోతుంది’’ అని ఆయన కామెంట్ చేశారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement