భారత్ బాసటగా నిలవండి.. ఫాలోవర్లకు అమెరికా నటి విజ్ఞప్తి!

ABN , First Publish Date - 2021-05-06T01:21:46+05:30 IST

భారత్‌ను కరోనా మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిత్యం వేలాది మందిని బలిగొంటోంది. ఈ తరుణంలో ప్రపంచ దేశాలు ఇండియాకు అండగా నిలుస్తున్నాయి. వైద్య పరికరాలు, ఔషధాలను తరలిస్తున్నా

భారత్ బాసటగా నిలవండి.. ఫాలోవర్లకు అమెరికా నటి విజ్ఞప్తి!

వాషింగ్టన్: భారత్‌ను కరోనా మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిత్యం వేలాది మందిని బలిగొంటోంది. ఈ తరుణంలో ప్రపంచ దేశాలు ఇండియాకు అండగా నిలుస్తున్నాయి. వైద్య పరికరాలు, ఔషధాలను తరలిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన ప్రముఖ నటి జెన్నిఫర్ అనిస్టన్ భారత్‌లో నెలకొన్న పరిస్థితుల పట్ల ఆందోళ వ్యక్తం చేశారు. ఇండియాలో కరోనా వైరస్ సృష్టిస్తున్న బీభత్సాన్ని వివరిస్తూ.. భారత్‌కు విరాళాలు అందించాల్సిందిగా తన ఫాలోవర్లను ఇన్‌స్టా‌గ్రాంలో కోరారు. ‘కరోనా సెకెండ్ వేవ్‌ భారతదేశం అంతటా వ్యాపించింది. గత ఐదు రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అమెరికేర్స్ ఇండియా ఫౌండేషన్ అనే సంస్థ విరాళాలు సేకరిస్తోంది. ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్న విరాళాలలతో హెల్త్ కేర్ వర్కర్‌లకు పీపీఈ కిట్‌లు అందజేయడంతోపాటు వైద్య పరికరాలను ఔషధాలు అందజేస్తోంది. వీలైన వాళ్లు డొనేషన్ ద్వారా ఇండియాకు అండగా నిలవండి. ఆర్థిక స్తోమత లేని వారు కనీసం ఈ సమాచారాన్ని వివిధ సామాజిక మాద్యమాల్లోకి షేర్ చేయడం ద్వారా అయినా భారత్‌కు బాసటగా నిలవండి’ అని పేర్కొన్నారు. 


Updated Date - 2021-05-06T01:21:46+05:30 IST