ట్రంప్‌కు షాకిస్తూ.. జో బైడెన్‌కే మద్దతు తెలిపిన జెన్నీఫర్ లోపెజ్

ABN , First Publish Date - 2020-10-18T00:33:12+05:30 IST

అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. జో బైడెన్‌కు జై కొడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా సెలబ్రెటీ కపుల్ జెన్నీఫర్ లోపెజ్ ఆమె భర్త అలెక్స్ రోడ్రిగేజ్ కూడా డెమొక్రటిక్ అభ్య

ట్రంప్‌కు షాకిస్తూ.. జో బైడెన్‌కే మద్దతు తెలిపిన జెన్నీఫర్ లోపెజ్

వాషింగ్టన్:  అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. జో బైడెన్‌కు జై కొడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను కలిగి ఉన్న ప్రముఖ నటి, సింగర్ జెన్నీఫర్ లోపేజ్ కూడా తాజాగా తన మద్దతను డెమొక్రటిక్ అభ్యర్థికి ప్రకటించారు. మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్, అతని భార్య జిల్ బైడెన్‌తో జెన్నీఫర్ దంపతులు శుక్రవారం రోజు వర్చువల్ చాట్ సెషన్‌‌లో సంభాషించారు. ఈ సందర్భంగా ఈ సెలబ్రెటీ కపుల్.. జో బైడెన్‌కు మద్దతు తెలిపారు.  అంతేకాకుండా అమెరికా ఎదుర్కొంటున్న కరోనా వైరస్ తీవ్రత, ఆర్థిక రంగ సంక్షోభం తదితర సమస్యలపై జో బైడెన్‌తో చర్చించారు. అయితే జో బెడెన్‌కు జెన్నీఫర్ సపోర్ట్ చేయడంతో రిపబ్లిక్ నేతల్లో కలవరం మొదలైంది. అమెరికాలో జన్నీఫర్‌కు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. వారంతా ఆమె మార్గాన్నే ఎంచుకుని రాబోయే ఎన్నికల్లో జో బైడెన్‌కు ఓటేసే అవకాశం ఉందని ట్రంప్ బృందం భావిస్తోంది. ఓకవేళ తాము ఊహించిందే జరిగితే.. తమ పార్టీకి ఓటమి తప్పదని రిపబ్లిక్ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. 


ఇదిలా ఉంటే.. కొద్దిరోజుల క్రితం అమెరికాకు చెందిన ఓ ప్రముఖ పత్రిక కూడా తన మద్దతును బహిరంగంగా మాజీ ఉపాధ్యక్షుడికే ప్రకటించింది. 175 సంవత్సరాల చరిత్ర ఉన్న సైంటిఫిక్ అమెరికన్ మ్యాగజైన్.. జో బైడెన్‌కు జై కొట్టింది. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు ఓటు వేయాలని తన పాఠకులను కోరింది. అలా ప్రకటించడంపై విమర్శలు కూడా వచ్చాయి. కానీ మ్యాగజైన్ మాత్రం వాటిని పట్టించుకోలేదు. ఇకపోతే.. ఇండియన్ అమెరికన్ల మద్దతు కూడా జో బైడెన్‌కే ఉందని ఇప్పటికకే చాలా సర్వేలు తేల్చేశాయి. నవంబర్ 3న జరగబోయే ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీకి ఓటేసేందుకు 72శాతం మంది ఇండియన్ అమెరికన్లు సిద్ధమైనట్టు తాజా సర్వేల్లో వెల్లడైన విషయం తెలిసిందే.

Updated Date - 2020-10-18T00:33:12+05:30 IST