వారే గొప్పవారు!

ABN , First Publish Date - 2020-02-21T06:12:18+05:30 IST

ఉన్నతమైన ఏ స్థితిని పొందాలన్నా దానికి కావలసిన అర్హత ఏదో అది ఉండాలి. అన్నిటికన్నా అత్యుత్తమమైనదైన స్వర్గంలో ప్రవేశానికి అర్హత ఏమిటి? అక్కడ ఎవరు గొప్పవారు? ఇలాంటి ప్రశ్న ఏసు ప్రభువు శిష్యులలో ఒక సందర్భంలో తలెత్తింది.

వారే గొప్పవారు!

ఉన్నతమైన ఏ స్థితిని పొందాలన్నా దానికి కావలసిన అర్హత ఏదో అది ఉండాలి. అన్నిటికన్నా అత్యుత్తమమైనదైన స్వర్గంలో ప్రవేశానికి అర్హత ఏమిటి? అక్కడ ఎవరు గొప్పవారు? ఇలాంటి ప్రశ్న ఏసు ప్రభువు శిష్యులలో ఒక సందర్భంలో తలెత్తింది. 


ఏసు ప్రభువు విశ్రమించి ఉండగా, వారు ఆయనను సమీపించి ‘‘పరలోక రాజ్యంలో గొప్పవారు ఎవరు?’’ అని అడిగారు. 


దగ్గరలో ఉన్న ఒక చిన్న పిల్లవాడిని ఆయన పిలిచాడు. తన శిష్యుల మధ్య నిలబడమన్నాడు. 


ఆ తరువాత శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘నేను మీకు నిజం చెబుతాను. మీరు ఇలాంటి చిన్న పిల్లల్లా మారిపోకపోతే, పరలోక రాజ్యంలోకి మీరు ఎన్నటికీ ప్రవేశించలేరు. ఈ చిన్న పిల్లవాడిలా ఎవరైతే విఽధేయులుగా ఉంటారో వారే పరలోక రాజ్యంలో గొప్పవారు’’ అని చెప్పాడు. 


విశ్వాసుల ఆలోచనా విధానం మారాలనీ, వారు చిన్న పిల్లల్లా ఆలోచించాలనీ ఏసు ప్రభువు చెప్పిన మాటల్లోని ఉద్దేశ్యం- పరిణతి లేకుండా పిల్లల్లా ప్రవర్తించాలని కాదు... విషయాలను పిల్లల మాదిరిగా స్వీకరించాలని! పిల్లలు వాళ్ళు విన్నదాన్నీ, చూసిన దాన్నీ నమ్ముతారు. పెరుగుతున్న కొద్దీ ప్రతిదాన్నీ ప్రశ్నించడం మొదలవుతుంది. అయితే పరలోక రాజ్యంలో విశ్వాసం ప్రధానం. దేవుడి ప్రసన్నత దాని వల్లే లభిస్తుంది. అది పొందిన వారిదే స్వర్గం! కాబట్టి పిల్లల మాదిరిగా విశ్వాసాన్ని కలిగి ఉండాలనీ, ప్రశ్నలకు తావులేని విశ్వాసి మాత్రమే పరలోకంలో గొప్పవాడుగా ఆదరణ పొందుతాడనీ ఏసు మాటల వెనుక సారాంశం. 

Updated Date - 2020-02-21T06:12:18+05:30 IST