మళ్ళీ ఎగరనున్న జెట్...

ABN , First Publish Date - 2021-06-23T20:58:53+05:30 IST

ఆర్థిక సమస్యలతో రెండేళ్ల క్రితం మూతబడిన జెట్ ఎయిర్‌వేస్ మళ్ళీ ఎగరనుంది. ప్రయివేట్ ఎయిర్ లైన్స్ దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా జలాన్-కల్రాక్ కన్సార్టియం సమర్పించిన బిడ్‌కు జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్(ఎన్‌సీఏటీ) ముంబై బెంచ్ ఆమోదం తెలిపింది.

మళ్ళీ ఎగరనున్న జెట్...


న్యూఢిల్లీ : ఆర్థిక సమస్యలతో రెండేళ్ల క్రితం మూతబడిన జెట్ ఎయిర్‌వేస్ మళ్ళీ ఎగరనుంది. ప్రయివేట్ ఎయిర్ లైన్స్ దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా జలాన్-కల్రాక్ కన్సార్టియం సమర్పించిన బిడ్‌కు జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్(ఎన్‌సీఏటీ) ముంబై బెంచ్ ఆమోదం తెలిపింది. ఈ నెల 22 నుండి 90 రోజుల్లో పరిష్కార ప్రణాళికను అమలు చేయాలని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.


అమలుకు మరింత సమయం అవసరమైతే జలాన్-కల్రాక్ కన్సార్షియం ట్రైబ్యునల్‌ను సంప్రదించవచ్చని తెలిపింది. ఈ కన్సార్షియం బిడ్‌కు ఎయిర్‌లైన్స్ రుణదాతల కమిటీ... గతేడాది అక్టోబరులో ఆమోదం లభించింది. రుణ సంక్షోభం నేపధంలో 2019 ఏప్రిల్ 17 జెట్ ఎయిర్‌వేస్ కార్యకలాపాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-06-23T20:58:53+05:30 IST