Raksha Bandhan: బంగారం,వెండి రాఖీలు సిద్ధం

ABN , First Publish Date - 2021-08-02T12:43:51+05:30 IST

ఈ ఏడాది మార్కెట్‌లో కొత్త డిజైన్లతో బంగారం, వెండి రాఖీలు వచ్చాయి....

Raksha Bandhan: బంగారం,వెండి రాఖీలు సిద్ధం

రాజ్‌కోట్ బంగారం వ్యాపారుల ఆవిష్కరణ

రాజ్‌కోట్ (గుజరాత్): ఈ ఏడాది మార్కెట్‌లో కొత్త డిజైన్లతో బంగారం, వెండి రాఖీలు వచ్చాయి. రక్షాబంధన్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ బంగారం వ్యాపారులు బంగారం, వెండితో తయారు చేసిన రాఖీలను సిద్ధం చేశారు. ఈ ఏడాది రక్షబంధన్ కోసం ప్రత్యేకంగా 22 కేరట్ల బంగారంతో కూడిన రాఖీలను 50 డిజైన్లలో తయారు చేశామని రాజ్‌కోట్ బంగారం షాపు వ్యాపారి సిద్ధార్థ సహోలియా చెప్పారు. 1 నుంచి 1.5 గ్రాముల బంగారంతో రాఖీలు తయారు చేశారు. దీంతోపాటు వెండితో వివిధ రకాల రాఖీలను 150 నుంచి 550 రూపాయల వరకు అందిస్తున్నామని వ్యాపారులు చెప్పారు.రాఖీల తయారీలో గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ ప్రసిద్ధి. 


బంగారంతో తయారు చేసిన రాఖీలకు మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారని వ్యాపారులు చెప్పారు. బంగారం రాఖీని రూ.6వేల నుంచి 10వేల రూపాయల వరకు ధర నిర్ణయించామని బంగారం వ్యాపారులు వివరించారు. వివిధ రకాల డిజైన్లతో బంగారం, వెండి రాఖీలను చెక్క బాక్సుల్లో పెట్టి, వాటితోపాటు డ్రై ఫ్రూట్లు, చాక్లెట్లతో కలిపి విక్రయిస్తున్నారు. అన్నా చెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగ ఈ నెల 22వతేదీన జరగనున్న నేపథ్యంలో రాజ్ కోట్ బంగారం వ్యాపారులు వివిధరకాల డిజైన్లతో కూడిన బంగారం, వెండి రాఖీలను తయారు చేసి వాటిని ఆదివారం ఆవిష్కరించారు.


Updated Date - 2021-08-02T12:43:51+05:30 IST