Abn logo
May 23 2020 @ 16:32PM

శ్రీదేవి కూతురు సౌత్‌కు పరిచయమయ్యేది ఈ చిత్రంతోనే..!

శ్రీదేవి కూతురు సౌత్ సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యేది ఎప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. పూరి జగన్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రంలో ముందు జాహ్నవి కపూరే హీరోయిన్ అని అన్నారు. కానీ అందుకు జాహ్నవి అంగీకరించలేదు. ఆ తర్వాత సౌత్ మీద జాహ్నవికి అంత ఇంట్రెస్ట్ లేదనే వార్తలు కూడా వచ్చాయి. అలాంటిదేమీ లేదు.. ప్రస్తుతం బిజీగా ఉన్నందువల్లే జాహ్నవి సౌత్ వైపు దృష్టి పెట్టలేదని బోనీకపూర్ వివరణ కూడా ఇచ్చారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ సౌత్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యే చిత్రం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ అని తెలుస్తుంది.


దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బోనీకపూర్ కూడా ఓ నిర్మాత అనే విషయం తెలిసిందే. ‘ధడక్’ చిత్రంతో తనెంటో నిరూపించుకున్న జాహ్నవి ‘వకీల్ సాబ్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తాజా సమాచారం. దిల్ రాజు ఆమెను తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నారు. ఈ విషయాన్ని దిల్ రాజు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట. సో.. ‘పింక్’ రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న సోషల్ థ్రిల్లర్ ‘వకీల్ సాబ్’ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన జాహ్నవి సౌత్ ఎంట్రీ ఇవ్వనుంది. మరి ఈ విషయం నిర్మాత దిల్ రాజు ఎప్పుడు ప్రకటిస్తారో.. చూద్దాం.

Advertisement
Advertisement
Advertisement