సెల్ఫ్ క్వారంటైన్‌కు జార్ఖండ్ సీఎం

ABN , First Publish Date - 2020-07-08T21:55:08+05:30 IST

ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమంత్రి కార్యాలయంలోని స్టాఫ్ సైతం స్వీయం నిర్బంధంలోకి వెళ్లింది. కాగా ముఖ్యమంత్రి నుంచి కోవిడ్-19 పరీక్ష కోసం నమూనాలు తీసుకున్నామని, వీలైనంత తొందరలోనే

సెల్ఫ్ క్వారంటైన్‌కు జార్ఖండ్ సీఎం

రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లారు. ఆయన కేబినేట్‌లోని ఓ మంత్రికి కరోనా సోకడంతో రాంచీలోని ఆయన నివాసంలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. ‘‘జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. సీఎం నివాసంలోకి ఎవరికి అనుమతి లేదు. రాష్ట్ర మంత్రి మిత్లేష్ ఠాకూర్‌కు కోవిడ్-19 పాజిటివ్ అని తేలడంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు’’ అని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విడుదలైన ఆ ప్రకటన పేర్కొంది.


ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమంత్రి కార్యాలయంలోని స్టాఫ్ సైతం స్వీయం నిర్బంధంలోకి వెళ్లింది. కాగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నుంచి కోవిడ్-19 పరీక్ష కోసం నమూనాలు తీసుకున్నామని, వీలైనంత తొందరలోనే ఫలితాలు వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు.

Updated Date - 2020-07-08T21:55:08+05:30 IST