10, 12వ తరగతి టాపర్లకు జార్ఖండ్ కార్ల బహుమతి

ABN , First Publish Date - 2020-09-23T22:21:32+05:30 IST

10, 12వ తరగతి టాపర్లకు జార్ఖండ్ కార్ల బహుమతి

10, 12వ తరగతి టాపర్లకు జార్ఖండ్ కార్ల బహుమతి

రాంచీ: జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం టాపర్లకు కార్లను బహుమతిగా ఇచ్చింది. 10వ, 12వ తరగతి రాష్ట్ర టాపర్లకు కార్లను జార్ఖండ్ విద్యా శాఖ మంత్రి బహుమతిగా ఇచ్చారు. జార్ఖండ్ అకాడెమిక్ కౌన్సిల్ నిర్వహించిన 10వ తరగతి, 12 వ తరగతి బోర్డు పరీక్షల్లో విజయం సాధించిన టాపర్లకు జార్ఖండ్ విద్యా శాఖ మంత్రి జగర్నాథ్ మహతో బుధవారం కార్లను బహుమతిగా ఇచ్చారు. మెట్రిక్యులేషన్ ఫలితాలు విడుదలైనప్పుడు రాష్ట్ర టాపర్లకు కార్లను బహుమతిగా ఇవ్వాలనే ఉద్దేశ్యాన్ని మంత్రి ప్రకటించారు. అమిత్ కుమార్ 91.4 శాతంతో 12 వ తరగతిలో అగ్రస్థానంలో ఉండగా, మనీష్ కుమార్ కటియార్ 98 శాతంతో 10వ తరగతిలో అగ్రస్థానంలో ఉన్నారు.

Updated Date - 2020-09-23T22:21:32+05:30 IST