వ్యాపారవేత్తని కిడ్నాప్ చేసిన దుండగులు.. సినీ ఫక్కీలో వారిని పట్టుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-10-26T12:55:46+05:30 IST

జార్ఖండ్ రాష్ట్రంలోని గఢ్‌వా జిల్లాలో ఆరుగురు దుండుగులు ఒక బిజినెస్‌మెన్‌ని కిడ్నాప్ చేసి ఒక లగ్జరీ కారులో పారిపోతుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వాళ్లని పట్టుకున్నారు. కిడ్నాపర్ల నుంచి లగ్జరీ కారు, ఆరు మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు త్వరగా స్పందించడం వలనే దొంగలను పట్టుకున్నారు. కానీ సాధారణంగా ఇలా జరగదు...

వ్యాపారవేత్తని కిడ్నాప్ చేసిన దుండగులు.. సినీ ఫక్కీలో వారిని పట్టుకున్న పోలీసులు

జార్ఖండ్ రాష్ట్రంలోని గఢ్‌వా జిల్లాలో ఆరుగురు దుండుగులు ఒక బిజినెస్‌మెన్‌ని కిడ్నాప్ చేసి ఒక లగ్జరీ కారులో పారిపోతుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వాళ్లని పట్టుకున్నారు. కిడ్నాపర్ల నుంచి మరో లగ్జరీ కారు, ఆరు మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు త్వరగా స్పందించడం వలనే దొంగలను పట్టుకున్నారు. కానీ సాధారణంగా ఇలా జరగదు. అసలు పోలీసులు ఇంత త్వరగా కిడ్నాపర్లను ఎలా పట్టుకున్నారంటే..


గఢ్‌వా నగరంలోని ఆకాశ్‌దీప్ అనే వ్యాపారవేత్తని కిడ్నాప్ చేసేందుకు ముందుగా ఆ కిడ్నాపర్లు స్కెచ్ వేశారు. ఒకరోజు ఆకాశ్‌దీప్ ఒక మెడికల్ స్టోర్ నుంచి బయటకు వస్తుండగా.. అక్కడికి ఒక పోలీస్ వాహనం(SUV) వచ్చి ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి బయటికి వచ్చి ఆకాశ్‌దీప్‌ని సార్ పిలుస్తున్నారని అన్నాడు.  ఆకాశ్‌దీప్‌ అది పోలీసు వాహనం అనుకొని వెళ్లాడు. కానీ ఆ కారులో నుంచి వెంటనే నలుగురు బయటకు వచ్చి ఆకాశ్‌దీప్‌ని బలవంతంగా కారులోకి తీసుకెళ్లారు. అప్పుడు పక్కనే ఉన్న ఆకాశ్‌దీప్ కారు డ్రైవర్ ఏం చేయాలో తోచక ఆ కారుని వెంబడించారు. 


ఆ దుండగలు ఆకాశ్‌దీప్‌ని తీసుకొని నగరం సరిహద్దులు దాటేశారు. అప్పుడు ఆకాశ్‌దీప్ డ్రైవర్ వెంటనే తన ఓనర్ ఫ్రెండ్‌కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆ తరువాత కిడ్నాప్ విషయం జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల వరకు చేరింది. వెంటనే పోలీసులు చుట్టు పక్కల నగరాల పోలీసులకు సమాచారం అందించారు. కారుపై పోలీస్ స్టికర్, కారు నెంబర్‌ని గుర్తింపుగా చెప్పారు. ఆ తరువాత కారు పక్కనే ఉన్న పులామా నగరంలో కనపడిందని సమాచారం అందింది. పులామా నగర పోలీసులంతా చెక్‌ పోస్టుల వద్ద తనిఖీ పెట్టారు. 


కిడ్నాపర్లు ఆ చెక్ పోస్టు వద్ద నుంచి తప్పించుకొని పారిపోతుండగా వారిని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఆకాశ్‌దీప్‌కు ఏ హాని జరగకుండా పోలీసులు కాపాడారు. ఆ తరువాత కిడ్నాపర్లను విచారణ చేయగా.. వారు బడా వ్యాపారస్తులను కిడ్నాప్ చేసేవారని ఒప్పుకున్నారు. కిడ్నాపర్లనుంచి మరో కారు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ కారుపై డాక్టరు గుర్తింపు ఉంది. ప్రస్తుతం పోలీసులు కిడ్నాపర్ల గుర్తింపు తెలుసుకొని వారిపై కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-10-26T12:55:46+05:30 IST