Abn logo
Apr 10 2021 @ 17:07PM

ఐపీఎల్ 2021: ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన జియో

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను పురస్కరించుకుని రియల్స్ జియో తమ ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లు తీసుకొచ్చింది. ఎంపిక చేసిన ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ ప్లస్ ప్లాన్ల ఖాతాదారులకు ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ అందించేందుకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో భాగస్వామ్యం కదుర్చుకుంది. ఇందులో భాగంగా రూ.399తో ఏడాది పాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. జియో పోస్టు పెయిడ్ ప్లస్ ప్లాన్లు నెలకు రూ. 399తో ప్రారంభం కానున్నాయి. అలాగే, నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్లతోనూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ను ఆఫర్ చేస్తోంది. 

జియో ప్రీపెయిడ్ యూజర్లకు వార్షిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్లు కనిష్టంగా రూ. 401 నుంచి రూ. 2,599 మధ్య అందుబాటులో ఉన్నాయి. రూ. 401 జియో ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌లో రోజుకు 3జీబీ హైస్పీడ్ డేటాతోపాటు అదనంగా 6జీబీ లభిస్తుంది. అపరిమిత కాల్స్‌తోపాటు ఏడాదిపాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ 28 రోజుల కాలపరిమితితో లభిస్తుంది.


రూ. 598 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, డిస్నీప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. కాలపరిమితి 56 రోజులు. రూ. 777 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటా, అదనంగా 5జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, డిస్నీప్లస్ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ 84 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. ఇక, రూ. 2,5999 జియో ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా, అదనంగా 10 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, డిస్నీప్లస్ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఏడాది కాలపరిమితితో లభిస్తుంది.


ఐపీఎల్‌ను దృష్టిలో పెట్టుకుని జియో పోస్టుపెయిడ్ యూజర్లకు కూడా డిస్నీప్లస్ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. కాగా, వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌ కూడా ఏడాది సబ్‌స్క్రిప్షన్‌తో పలు ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ ప్లాన్లను ప్రకటించాయి.

Advertisement
Advertisement
Advertisement