రెండు రోజులపాటు ఉచిత కాల్స్, డేటా.. ఆఫర్ చేస్తున్న జియో ఫైబర్

ABN , First Publish Date - 2020-07-01T02:42:27+05:30 IST

జియో ఫైబర్‌లో అంతరాయాలతో గతం యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటలపాటు సేవలు నిలిచిపోవడంతో

రెండు రోజులపాటు ఉచిత కాల్స్, డేటా.. ఆఫర్ చేస్తున్న జియో ఫైబర్

న్యూఢిల్లీ: జియో ఫైబర్‌లో అంతరాయాలతో గతవారం యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటలపాటు సేవలు నిలిచిపోవడంతో విసిగిపోయారు. అంతేకాదు, కాల్‌సెంటర్‌కు కూడా ఫోన్ చేయలేకపోయారు. దీంతో దేశవ్యాప్తంగా ట్విట్టర్ ద్వారా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ ఫిర్యాదులకు స్పందించిన జియో ఫైబర్ కొన్ని ప్రాంతాల్లో సర్వీసులో అంతరాయాలు నిజమేనని, సమస్యను పరిష్కరిస్తున్నట్టు పేర్కొంది.


అంతరాయాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న జియో ఫైబర్ యూజర్ల కోసం ఇప్పుడు రెండు రోజులపాటు అపరిమిత డేటా, కాల్స్‌ను అందిస్తోంది. అయితే, నెట్‌వర్క్ సమస్యలు ఎదుర్కొన్న వారికి మాత్రమే ఈ సదుపాయాన్ని పొందగలుగుతారు. ఈ రెండు రోజుల ప్లాన్ యాక్టివేట్ అయినట్టు టెక్స్ట్ మెసేజ్ ద్వారా యూజర్లకు తెలియజేస్తోంది.   

Updated Date - 2020-07-01T02:42:27+05:30 IST