Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రీపెయిడ్ ఖాతాదారులకు మరోమారు షాకిచ్చిన జియో

న్యూఢిల్లీ: ప్రీపెయిడ్ టారిఫ్ ధరలను పెంచి ఖాతాదారుల నెత్తిన భారం మోపిన రిలయన్స్ జియో మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏడాది పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభించే ఐదు బండిల్డ్ ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ల ధరలను పెంచింది. గతవారం ప్రీపెయిడ్ టారిఫ్‌లను పెంచిన సమయంలో వీటిని వదిలిపెట్టన జియో తాజాగా, వీటి ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జియో తాజా నిర్ణయంతో ప్రస్తుతం రూ. 499తో లభిస్తున్న కనిష్ట ప్లాన్ ధర ఇకపై రూ. 601 కానుంది. తాజా పెంపుతో వినియోగదారుల నెత్తిన 20 శాతం అధికభారం పడనుంది. 


రూ. 601 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 3 జీబీ హైస్పీడ్ డేటా 28 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. ఇందులో రూ. 499 విలువైన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఏడాది పాటు లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్‌తోపాటు అదనంగా 6జీబీ డేటాను యాక్సెస్ చేసుకునే అవకాశం కూడా ఉంది. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.

 

రూ. 666తో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్యాక్‌ కోసం ఇకపై రూ. 799 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రోజుకు 2 జీబీ చొప్పున లభిస్తుంది. కాలపరిమితి 56 రోజులు. ఇందులోనూ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. వీటితోపాటు రూ. 888 ప్లాన్ ధరను రూ. 1,066కి, రూ. 2,599 ప్లాన్‌ను రూ. 3,119కి పెంచింది. అలాగే, డేటా ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ అయిన రూ. 549 ధరను రూ. 659కి పెంచింది.

Advertisement
Advertisement