ముంబైలో జియో-బీపీ తొలి మొబిలిటీ స్టేషన్

ABN , First Publish Date - 2021-10-27T18:22:30+05:30 IST

ప్రముఖ పారిశ్రామిక సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్, బ్రిటన్‌ సంస్థ బీపీతో కలిసి ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌ సంస్థ ‘రిలయన్స్‌- బీపీ’ తొలి మొబిలిటీ స్టేషన్‌ను ముంబైలో ఆవిష్కరించింది.

ముంబైలో జియో-బీపీ తొలి మొబిలిటీ స్టేషన్

ముంబై: ప్రముఖ పారిశ్రామిక సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్, బ్రిటన్‌ సంస్థ బీపీతో కలిసి ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌ సంస్థ ‘రిలయన్స్‌- బీపీ’ తొలి మొబిలిటీ స్టేషన్‌ను ముంబైలో ఆవిష్కరించింది. జియో–బీపీ బ్రాండ్‌ కింద నవీ ముంబైలోని నావ్డేలో మంగళవారం దీన్ని ప్రారంభించింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా జియో–బీపీ మొబిలిటీ స్టేషన్‌లను తీర్చిదిద్దినట్లు సంస్థ పేర్కొంది. ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్, అడిటివైజ్డ్‌ ఇంధనాలు, రిఫ్రెష్‌మెంట్లు, ఫుడ్ మొదలైన వివిధ సర్వీసులన్నీ వీటిలో అందుబాటులో ఉంటాయనిని ఆర్‌బీఎంఎల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఇతర సాధారణ ఇంధనాలు కాకుండా మరింత శక్తిమంతమైన ఇంధనాలను, ఎటువంటి అదనపు ధర విధించకుండా, వీటిలో అందిస్తామని పేర్కొంది. అంతర్జాతీయ స్థాయి ‘యాక్టివ్‌’ టెక్నాలజీతో రూపొందించిన ఈ ఇంధనం.. కీలకమైన ఇంజిన్‌ భాగాలకు రక్షణ కల్పిస్తుందని, ఇంజిన్లను శుభ్రంగా ఉంచుతుందని ఆర్‌బీఎంఎల్‌ వివరించింది.

Updated Date - 2021-10-27T18:22:30+05:30 IST