శివసేనతో పొత్తు వెనక ఏ సిద్ధాంతం ఉంది? సిబాల్‌కు జితిన్ ప్రసాద కౌంటర్

ABN , First Publish Date - 2021-06-11T03:12:05+05:30 IST

వ్యక్తిగత రాజకీయం కోసమే జితిన్ ప్రసాద బీజేపీలో చేరాడన్న కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ వ్యాఖ్యలకు

శివసేనతో పొత్తు వెనక ఏ సిద్ధాంతం ఉంది? సిబాల్‌కు జితిన్ ప్రసాద కౌంటర్

న్యూఢిల్లీ : వ్యక్తిగత రాజకీయం కోసమే జితిన్ ప్రసాద బీజేపీలో చేరాడన్న కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ వ్యాఖ్యలకు బీజేపీ నేత జితిన్ ప్రసాద కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా బీజేపీలో చేరడాన్ని జితిన్ ప్రసాద గట్టిగా సమర్థించుకున్నారు. ‘‘బీజేపీలో చేరడం వెనుక ఎలాంటి సిద్ధాంతం లేదు. కేవలం దేశ ప్రయోజనాల కోసమే చేరాను. కపిల్ సిబాల్ చాలా సీనియర్ నేత. కాంగ్రెస్ శివసేనతో పొత్తు పెట్టుకుంది. ఆ సమయంలో కాంగ్రెస్ సిద్ధాంతం ఎటు వెళ్లిపోయింది? అంతేకాకుండా బెంగాల్‌లో సీపీఎంతో పొత్తు పెట్టుకుంది. ఆ సమయంలో ఎటు వెళ్లిపోయింది. కేరళలో కూడా అంతే. కేరళలో కాంగ్రెస్ వామపక్షాలతో పొత్తు పెట్టుకుంది. అప్పుడు సిద్ధాంతం ఎటు వెళ్లిపోయింది?’’ అంటూ సిబాల్‌పై జితిన్ ప్రసాద విరుచుకుపడ్డారు. 

Updated Date - 2021-06-11T03:12:05+05:30 IST