జీవో 217ను రద్దు చేయాలి: ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2021-10-26T05:02:28+05:30 IST

మత్స్యకారులకు ఇబ్బంది కలిగించే జీవో నెంబరు 217ను భేషరతుగా రద్దు చేయాలని ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.

జీవో 217ను రద్దు చేయాలి: ఎమ్మెల్సీ
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌

కర్నూలు (న్యూసిటీ), అక్టోబరు 25: మత్స్యకారులకు ఇబ్బంది కలిగించే జీవో నెంబరు 217ను భేషరతుగా రద్దు చేయాలని ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. నగరంలోని జడ్పీ సమావేశ భవనంలో సోమవారం  ఏపీ మత్స్యకార జేఏసీ జిల్లా కన్వీనర్‌ బి.శ్రీనివాసులు అధ్యక్షతన  జయహో మత్స్యకార కార్యక్రమంలో భాగంగా చైతన్య సదస్సు నిర్వహించారు. టీడీపీ కర్నూలు, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గాల అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.రామాంజనేయులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ మాట్లాడుతూ మత్స్యకారులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఏపీ ఫిషర్‌మెన్‌ కార్పొరేషన్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బీఎస్‌ నవీన్‌కుమార్‌ మాట్లాడుతూ మత్స్యకార భరోసాను రాయలసీమ జిల్లాలో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సంప్రదాయ మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు. సీపీఎం నగర కార్యదర్శి టి.రాముడు, జేఏసీ నాయకులు ఉండవల్లి వెంకటన్న, రామస్వామి, బాలరాజు, శ్రీను, ఈరన్న, గణేష్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-26T05:02:28+05:30 IST