జీవో 317ను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-01-17T05:10:13+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీవో 317ను రద్దు చేయాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె కిషన్‌రావు డిమాండ్‌ చేశారు.

జీవో 317ను రద్దు చేయాలి
డీఈవో కార్యాలయం ఎదుట క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న టీపీటీఎఫ్‌ ప్రతినిధులు

- టీపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు కె కిషన్‌రావు

పెద్దపల్లి కల్చరల్‌, జనవరి 16: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీవో 317ను రద్దు చేయాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె కిషన్‌రావు డిమాండ్‌ చేశారు.  పెద్దపల్లి డీఈవో కార్యాలయం ఎదుట ఆదివారం క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 317 జీవో ఉపాధ్యాయులకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నదన్నారు. భార్యాభర్తల బదిలీల ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో స్పౌజ్‌లను అమలు చేసి 13 జిల్లాలను బ్లాక్‌ చేయడం వల్ల భార్య, భర్తలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఈ జిల్లాల్లో కూడా స్పౌజ్‌లకు అవకాశం కల్పించాలన్నారు. జిల్లా అధ్యక్షుడు పోరెడ్డి దామోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అరుకాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సమక్షంలో జిల్లాల కేటాయింపు, బదిలీల నిబంధనలను రూపొందించాలన్నారు. కరోనా సాకు చూపి ఈ నెల 30వ తేదీ వరకు పాఠశాలలను మూసి వేయడం దారుణమన్నారు. దీనివల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. ఇప్పుడిప్పుడే చదువులో విద్యార్థులు గాడిన పడ్డారని, ఒకటి, రెండు రోజుల్లో పాఠశాలలను తెరిపించేందుకు సెలవులను రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.   కార్యక్రమంలో సంఘ నాయకులు మురళి నాయక్‌, వీర లక్ష్మణ్‌, సీహెచ్‌ పోచయ్య, కె దేవేందర్‌ గౌడ్‌, పర్శరాములు, రాజనర్సయ్య, కుమార్‌ గౌడ్‌, సుధాకర్‌ రెడ్డి, తిరుపతి, రమేష్‌, రవీందర్‌, మనోహర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-17T05:10:13+05:30 IST