Abn logo
Oct 26 2021 @ 23:49PM

జీవో-10 రద్దుచేయాలి

సోంపేటలో అధికారులకు వినతిపత్రం అందజేస్తున్న రేషన్‌ డీలర్లు

  రేషన్‌ డీలర్ల నిరసన

  అధికారులకు వినతిపత్రాలు 


ఇచ్ఛాపురం: తక్షణమే జీవో-10   రద్దుచేయాలని    డీలర్ల సంఘ అధ్యక్ష కార్యదర్శులు చంద్రమౌళి, చక్రి కోరారు. మంగళవారం ఏఎస్‌పేటలో గల ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద డీలర్ల సంఘ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు  నిరసనలు తెలిపారు. అనంతరం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జి రాజశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కవిటి డీలర్ల సంఘ అధ్యక్షుడు వేణు, టెక్కలి డివిజన్‌ డీలర్ల సంఘ ఉపాధ్యక్షుడు వలపల రమణ పాల్గొన్నారు.  సోంపేట: సోంపేటలో జీవో -10 రద్దుచేయాలని మంగళవారం డీలర్లు నిరసన తెలిపారు. సంచికి రూ.20 ఇప్పించాలని కోరారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డీలర్ల సంఘ రాష్ట్ర కార్యదర్శి సానా షణ్ముఖరావు, డీలర్లు దున్న బైరాగి, మల్లా కృష్ణారావు, కాంచన రాఘవదాసు, ఉషారాణి పాల్గొన్నారు.