Jammu kashmir : రాళ్లు రువ్వే వారి విషయంలో సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2021-08-01T18:44:38+05:30 IST

దేశ ద్రోహులు, రాళ్లు విసిరే వారి విషయంలో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది. ఇకపై వారి విషయంలో కఠినంగా

Jammu kashmir : రాళ్లు రువ్వే వారి విషయంలో సంచలన నిర్ణయం

శ్రీనగర్ : దేశ ద్రోహులు, రాళ్లు విసిరే వారి విషయంలో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది. ఇకపై వారి విషయంలో కఠినంగా వ్యవహరించడానికి రెడీ అయిపోయింది. దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారు, మిలటరీ, పోలీసులపై రాళ్లు రువ్వేవారికి ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానం లభించదు. అలాంటి వారికి పాస్‌పోర్టులను కూడా జారీ చేయరు. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాళ్ల దాడులకు దిగేవారు, దేశ భద్రతకు ముప్పు కలిగించే వ్యవహారాల్లో పాల్గొనే వారు ఇకపై విదేశాలకు వెళ్లే అవకాశమే ఉండదని అధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ మేరకు సీఐడీ స్పెషల్ బ్రాంచ్ అధికారులు అన్ని విభాగాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏ వ్యక్తికైనా సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చే సమయంలో రాళ్లు రువ్వడం, దేశ భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాల్లో పాల్గొన్నారా? లేదా? అన్న విషయాన్ని పోలీసులు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, సీసీ టీవీలను క్షుణ్ణంగా పరిశీలించాలని కూడా సీఐడీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 

Updated Date - 2021-08-01T18:44:38+05:30 IST