జైలు నుంచి విడుదల కానున్న జమ్మూ కశ్మీర్ నేత షా ఫెసల్

ABN , First Publish Date - 2020-06-03T22:51:48+05:30 IST

మాజీ ఐఏఎస్ అధికారి, జమ్మూ కశ్మీర్ పీపుల్స్ మూమెంట్ పార్టీ అధ్యక్షుడు షా ఫెసల్ త్వరలో జైలు నుంచి విడుదల కాబోతున్నట్లు అధికారులు

జైలు నుంచి విడుదల కానున్న జమ్మూ కశ్మీర్ నేత షా ఫెసల్

శ్రీనగర్ : మాజీ ఐఏఎస్ అధికారి, జమ్మూ కశ్మీర్ పీపుల్స్ మూమెంట్ పార్టీ అధ్యక్షుడు షా ఫెసల్ త్వరలో జైలు నుంచి విడుదల కాబోతున్నట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. ప్రజా భద్రతా చట్టం కింద ఆయనను అధికారులు జైళ్లో పెట్టారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఆగస్టు 14,2019 లో అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈయనతో పాటు పీడీపీ నేత సర్తాజ్ మదానీపై కూడా ప్రజా భద్రతా చట్టాన్ని ఎత్తేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 

Updated Date - 2020-06-03T22:51:48+05:30 IST