నూతన జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలి

ABN , First Publish Date - 2021-06-22T04:12:45+05:30 IST

ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లుందని, ఆ క్యాలెండర్‌ను రద్దు చేసి అన్ని ఖాళీలతో నూతన జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలని నిరుద్యోగ పోరాట సమితి డిమాండ్‌ చేసింది.

నూతన జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలి
ట్రంకురోడ్డులో బైఠాయించి నిరసన తెలుపుతున్న నిరుద్యోగులు

కావలిటౌన, జూన 21 : ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లుందని, ఆ క్యాలెండర్‌ను రద్దు చేసి అన్ని ఖాళీలతో నూతన జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలని నిరుద్యోగ పోరాట సమితి డిమాండ్‌ చేసింది. సోమవారం నిరుద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో యువకులు కావలిలోని ట్రంకురోడ్డు బ్రిడ్జి కూడలిలో బైఠాయించారు. అక్కడ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. ఆర్డీవో శ్రీనివాసులుకు వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ వాస్తవ ఖాళీలు చూపకుండా అతి తక్కువ ఖాళీలతో క్యాలెండర్‌ విడుదల చేయడం నిరుద్యోగ యువతను మోసం చేయడమేనన్నారు.  కార్యక్రమంలో సమితి సభ్యులు పీ మహేంద్ర, కె భాస్కర్‌, కె అశోక్‌, కె మారుతి, పీ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T04:12:45+05:30 IST