‘‘ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకుంటున్నా.. నాన్న, అన్నలు జాగ్రత్త. అమ్మ పైలం’’

ABN , First Publish Date - 2021-11-08T13:37:06+05:30 IST

ఉద్యోగం రాలేదన్న మనస్థాపంతో..

‘‘ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకుంటున్నా.. నాన్న, అన్నలు జాగ్రత్త. అమ్మ పైలం’’

యువకుడి ఆత్మహత్య

ఉద్యోగం రాలేదని సూసైడ్‌ నోట్‌


దుబ్బాక: ఉద్యోగం రాలేదన్న మనస్థాపంతో మరో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మునిసిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్‌కు చెందిన పెంజర్ల భిక్షపతి కుమారుడు రాకేశ్‌ (19) ఆదివారం సాయంత్రం తమ పొలం పక్కనున్న మరొకరి పొలంలోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ‘‘ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకుంటున్నా.. నాన్న, అన్నలు జాగ్రత్త. అమ్మ పైలం’’ అని రాసి ఉన్న ఓ లేఖ ఘటనా స్థలంలో లభించింది. ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్సును పూర్తి చేసిన రాకేశ్‌.. ఉద్యోగం రాలేదనే మనస్థాపంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పలువురు స్థానికులు తెలిపారు. ఇంకొందరు గ్రామస్థులు మాత్రం తండ్రితో గొడవల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-11-08T13:37:06+05:30 IST