Job Placement Agency ఆశ చూపి.. 20 లక్షలు ఫట్‌

ABN , First Publish Date - 2021-10-20T17:36:43+05:30 IST

జాబ్‌ ప్లేస్‌మెంట్‌ ఏజెన్సీ ద్వారా భారీ ఆదాయం వస్తుందని నమ్మించిన సైబర్‌ కేటుగాడు ఒకరి నుంచి రూ.20లక్షలు కాజేసాడు. సిటీ సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపిన

Job Placement Agency ఆశ చూపి.. 20 లక్షలు ఫట్‌

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌: జాబ్‌ ప్లేస్‌మెంట్‌ ఏజెన్సీ ద్వారా భారీ ఆదాయం వస్తుందని నమ్మించిన సైబర్‌ కేటుగాడు ఒకరి నుంచి రూ.20లక్షలు కాజేసాడు. సిటీ సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్‌కు చెందిన శివశంకర్‌కు ఇటీవల ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసాడు. తాను ఢిల్లీకి చెందిన సిక్రూట్‌ హెచ్‌ఆర్‌ టెక్నాలజీస్‌ నుంచి కాల్‌ చేస్తున్నానని, జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ, అంతర్జాతీయ సంస్థలలో జాబ్‌ ప్లేస్‌మెంట్‌ ఇప్పిస్తానని చెప్పాడు. తమ ఏజెన్సీ తీసుకుంటే పెద్ద మొత్తంలో కమీషన్‌ వస్తుందని ఆశ చూపాడు. అతడి మాటలు నమ్మిన శివశంకర్‌ ఏజెన్సీ నిమిత్తం ఓ సారి రూ. 5 లక్షలు, మరోసారి ఇంకో రూ.5లక్షలు, 3 లక్షలు ఇలా మొత్తం రూ.20 లక్షలు వారు పంపిన లింకు ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. ఆగంతుకుడు మళ్లీ మరో ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో అనుమా నించిన బాధితుడు తనకు ఏజెన్సీ వద్దని, తన డబ్బులు రిటర్న్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసిన ఆగంతుకుడు, తర్వాత బాధితుడి ఫోన్‌ నెంబర్‌, సోషల్‌మీడియా అకౌంట్స్‌ కూడా బ్లాక్‌ చేశాడు. దీంతో శివశంకర్‌ సిటీ సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2021-10-20T17:36:43+05:30 IST