Advertisement
Advertisement
Abn logo
Advertisement

అలాంటి ఉద్యోగాలకు రిస్క్‌ ఎక్కువే!

కోవిడ్‌ సమయంలో పాపులరైన మాట - వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌. కొవిడ్‌ సమయంలో వర్క్‌ఫ్రమ్‌ చేయించుకోవటానికి ఐటీ సంస్థలకు తప్పలేదు. చేయటానికి ఉద్యోగులకి తప్పలేదు. అయితే ఇక జీవితాంతం వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ ఇవ్వటానికి కొన్ని కంపెనీలు సిద్ధమవుతున్నాయని వార్తలొస్తున్నాయి. ఈ విషయం పక్కనబెడితే.. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేసేవారికి లైఫ్‌ రిస్క్‌ ఎక్కువేనని సర్వేలు చెబుతున్నాయి.


టెలీవర్కింగ్‌, ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ ఉద్యోగాల నుంచి ఐటీ ఉద్యోగాల వరకూ వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ పని చేస్తున్నారు. ఇంటర్నెట్‌ ఉంటే చాలు నడిచే ఉద్యోగాల్లో దాదాపు 71 శాతం ఇంటినుంచే పని చేస్తున్నారు. కొవిడ్‌ సమయంలో ఇంటి నుంచే ఉద్యోగాలు చేయటం కొందరికి అలవాటయింది. మరికొందరు ఆఫీసుకి వెళ్లి పనిచేయడం మంచిదంటున్నారు. అయితే ఇంటి నుంచి పనిచేయటం వల్ల ఎక్కువ పని చేయాల్సి వస్తుందని, ఆ వర్క్‌ బర్డెన్‌ని తట్టుకోవటం కష్టమంటున్నారు. దీంతో పాటు ఇంట్లో ఉంటే హోమ్‌లైఫ్‌, ప్రొఫెషనల్‌ లైఫ్‌ ఏదో అర్థం కాలేదని మరికొందరు వాపోతున్నారు. ఇదిలా ఉంటే వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ సంస్థ వారంలో 55 గంటలకుపైగా పని చేసేవారికి తీవ్రమైన అనారోగ్యసమస్యలు తలెత్తుతాయని చెబుతోంది. 35 శాతం బ్రెయిన్‌ స్ర్టోక్‌, 17 శాతం హార్ట్‌ అటాక్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయని  డబ్లుహెచ్‌ఓ సర్వేలో తేలింది. అందుకే  వారంలో 35 గంటల నుంచి 40 గంటలలోపు పనే ఉండాలి. ఇందుకోసం ఉద్యోగుల మధ్య పని విభజన ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఆలోచించాల్సిన విషయమే కదూ!

Advertisement
Advertisement