మెప్మా ఆర్పీలకు..40 ఏళ్లు పైబడినా ఉద్యోగ భద్రత

ABN , First Publish Date - 2020-02-23T06:10:15+05:30 IST

జిల్లాలో మెప్మాలో రిసోర్స్‌ పర్సన్స్‌గా దాదాపు 400 మంది పనిచేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్‌ ప్రకారం 40 ఏళ్లు దాటినా కొన్ని నిబంధనల ప్రకారం వారికి ఉద్యోగ

మెప్మా ఆర్పీలకు..40 ఏళ్లు పైబడినా ఉద్యోగ భద్రత

పీడీ రమేష్‌ 


నాయుడుపేట, ఫిబ్రవరి 22: జిల్లాలో మెప్మాలో రిసోర్స్‌ పర్సన్స్‌గా దాదాపు 400 మంది పనిచేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్‌ ప్రకారం 40 ఏళ్లు దాటినా కొన్ని నిబంధనల ప్రకారం వారికి ఉద్యోగ భద్రత ఉంటుందని మెప్మా పీడీ కె.రమేష్‌ అన్నారు. నాయుడుపేట మెప్మా కార్యాలఆన్ని శనివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో 33 మంది రిసోర్స్‌ పర్సన్‌లు, 750 మెప్మా గ్రూపులు ఉన్నట్లు గుర్తించామన్నారు. మున్సిపాలిటీలో వార్డులు పెరగడంతోపాటు జువ్వలపాళెం, విన్నమాల, మర్లపల్లి పంచాయతీలో కొంత భాగం కలవడంతో దాదాపు 6వేల మంది జనాభా పెరిగారన్నారు. అందుకు అనుగుణంగా కనిష్ఠంగా 1000 గ్రూపులు చేయాలని సూచించారు. మెప్మా పట్టణ అధ్యక్షురాలుగా ఉన్న కవిత జిల్లా మెప్మా ఉపాధ్యక్షురాలుగా ఎంపికైనట్లు ప్రకటించారు. దాంతో మెప్మా పీడీ రమేష్‌, టీఎంసీ జయరామ్‌, రిసోర్స్‌ పర్సన్‌లు కవితకు అభినందనలు తెలిపారు. 

Updated Date - 2020-02-23T06:10:15+05:30 IST