ఉద్యోగ, ఉపాధ్యాయులు అధైర్యపడొద్దు

ABN , First Publish Date - 2022-01-25T05:49:14+05:30 IST

ద్యోగ, ఉపాధ్యాయులకు శాపంగా మారిరన జీవో నెం.317ను రద్దు చేసే వరకు కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు, కాంగ్రెస్‌ నాయకుడు హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు.

ఉద్యోగ, ఉపాధ్యాయులు అధైర్యపడొద్దు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సమావేశమైన ఉపాధ్యాయ సంఘాల నాయకులు, టీపీఆర్టీయూ వ్యవస్థాపకుడు హర్షవర్ధన్‌రెడ్డి

- జీవో 317 రద్దు చేసేవరకు కాంగ్రెస్‌ పోరాడుతుంది

 - టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 


మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం జనవరి 24 : ఉద్యోగ, ఉపాధ్యాయులకు శాపంగా మారిరన జీవో నెం.317ను రద్దు చేసే వరకు కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు, కాంగ్రెస్‌ నాయకుడు హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కలిసి హర్షవర్ధన్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సమావేశమై జీవో 317పై చర్చించినట్లు తెలిపారు. ప్రభుత్వ తీరుతో పలువురు ఉపాధ్యాయులు ఆత్మహత్యలకు పాల్పడగా తీవ్ర మనస్తాపం చెందారని  తెలిపారు. ఈ నెల 29 న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్‌ ముందు చేపట్టే ధర్నాలకు పార్టీ మద్దతు కోరినట్లు ఆయన తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయులలకు సంబం ధించిన సమస్యలను పర్కిరింంచే వరకు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారని, రాష్ట్రపతి ఉత్తరువలకు భిన్నంగా తీసిన జీవో 317 మూలంగా ఉద్యో గ, ఉపా ధ్యాయుల స్థానికతకు విఘాతం కల్గుతోందని పేర్కొన్నారు. ఆ జీవో పై ప్రధాని జోక్యం చేసుకొని వెంటనే రద్దు చేసే విధంగా ఫిబ్రవరి 5న హైదరాబాద్‌ విచ్చేస్తున్న ప్రధాని మెదీని కలిసేందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల బృందంతో అపాయింట్‌ కోరుతామని తెలిపారు.  అదేవిధంగా ఫిబ్రవరి 13న హైదరాబాద్‌ కు రాష్ట్రపతి కూడా రానున్నారని, ఆయననూ కలుస్తామని తెలిపారు. ఈ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు వేంనరేందర్‌రెడ్డి, టీపీసీసీ ఆధికార ప్రతినిధి మానవతారాయ్‌, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పోచయ్య, రవిశంకర్‌, మైకా శ్రీనివాస్‌, మహమ్మద్‌ షౌఖత్‌ అలీ, లక్ష్మన్‌ నాయక్‌, సైదులు, యాదగిరి తదితరులు పాల్గోన్నారు.

Updated Date - 2022-01-25T05:49:14+05:30 IST