నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు

ABN , First Publish Date - 2021-07-21T14:22:17+05:30 IST

జిల్లా గ్రామీణ సంస్థ, సిడాప్‌ సంయుక్త ఆధ్వర్యంలో..

నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు

కొల్లూరు: జిల్లా గ్రామీణ సంస్థ, సిడాప్‌ సంయుక్త ఆధ్వర్యంలో హెటిరో ఫార్మా సంస్థలో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు డీఆర్‌డీఏ జేఆర్‌పీ అరుణ్‌కుమార్‌ మంగళవారం తెలిపారు. హైదరాబాద్‌లోని హెటిరో ఫార్మా కంపెనీలో క్వాలిటీ కంట్రోల్‌ ప్రొడక్షన్‌ పోస్టులు 70, మెయింటెనెన్స్‌ పోస్టులు 30, ఖాళీలు ఉన్నాయని క్వాలిటీ కంట్రోలో పోస్టుకు విద్యార్హత ఎంఎస్సీ, (ఆర్గానిక్‌, అనలైటికల్‌, ఇండస్ట్రీయల్‌) బి.ఫార్మసీ ప్రొడక్షన్‌ పోస్టులకు బీఎస్సీ కెమిస్ట్రీ, మెయింటెనెన్స్‌ పోస్టుకు ఐటీఐ ఫిట్టర్‌, డిప్లోమో మెకానిక్‌ విద్యార్హత ఉన్న యువకులు మాత్రం దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ నెల 23వ తేదీన ఆసక్తి కలిగిన యువకులు గుంటూరు చుట్టగుంట సెంటర్‌లోని పోలేరమ్మ గుడి కల్యాణ మండపం నందు జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని, విద్యార్హత పత్రాలు, రేషన్‌, ఆధార్‌, నకళ్లతో పాటు పాస్‌పోర్టు సైజు ఫోటోలతో రావాలని సూచించారు. వివరాలకు 9392545506లో సంప్రదించాలన్నారు. 




Updated Date - 2021-07-21T14:22:17+05:30 IST