ఉద్యోగమా? వ్యాపారమా?.. ఏం చేయాలో తోచడం లేదా?.. అయితే ఈ సలహాలు మీ కోసమే..

ABN , First Publish Date - 2021-12-14T15:10:20+05:30 IST

ఈ ప్రపంచంలో చాలా మంది బాగా చదువుకొని..

ఉద్యోగమా? వ్యాపారమా?.. ఏం చేయాలో తోచడం లేదా?.. అయితే ఈ సలహాలు మీ కోసమే..

ఈ ప్రపంచంలో చాలా మంది బాగా చదువుకొని, మంచి ఉద్యోగం సంపాదించి, అత్యధిక జీతం అందుకుని జీవితంలో సుఖంగా ఉండాలని చిన్నప్పటి నుంచి కలలు కంటుంటారు. ఉద్యోగం చేయడమనేది జీవితానికి భద్రతను ఇస్తుందని చాలామంది చెబుతుండటంతో.. అందరిలోనూ చిన్నప్పటి నుంచి ఇటువంటి ఆలోచనలే కలుగుతుంటాయి. అలాగే ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనుకునేవారు మంచి ఉద్యోగం కోసం వెదుకుతుంటారు. ఇందుకోసం బాగా చదువుకుని పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటారు. తద్వారా మంచి ఉద్యోగం సంపాదించవచ్చని ఆశ పడుతుంటారు.  చిన్నప్పటి నుంచి మన ఇంటిలోని పెద్దలు మనం బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగం చేయాలని ఆశీర్వదిస్తుంటారు. మన విద్యావిధానం కూడా ఉద్యోగాన్ని ప్రోత్సహించేదిగానే ఉన్నదని చాలా మంది ఆరోపిస్తుంటారు. నెలానెలా జీతం వస్తుందని, ఆ సొమ్ముతో అవసరాలను తీర్చుకోవచ్చని భావిస్తుంటారు. ఈ భావనతో ఉన్నవారి దృష్టి కేవలం జీతం, పెన్షన్, బీమా, ఉద్యోగ భద్రతపై మాత్రమే ఉంటుంది.


స్వయం ఉపాధి

ఒకరి కింద పని చేయడం ఇష్టం లేనివారు. తమకు తామే యజమానిగా భావించే వారు.. ఒక ఉద్యోగి ఆలోచనా తీరుకు భిన్నంగా ఉంటారు. తమ కోసం తామే ఒక ఉద్యోగాన్ని సృష్టించుకుంటారు. స్వయం ఉపాధి మార్గాన్ని ఏర్పరుచుకునేవారికి, వ్యాపారం చేసేవారికి మధ్య చాలా తేడా ఉంటుంది. ఉదాహరణకు రాహుల్ అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు.. అయితే అతనికి ఉద్యోగం వదిలేసి, సొంతంగా ఏదైనా చేయాలని అనిపించింది. ఫలితంగా తాను నిపుణత సాధించిన పనినే ఆధారం చేసుకుని సొంతగా ఒక యూనిట్ ఏర్పాటు చేసుకుంటాడు. అవసరమైవారికి సంబంధింత సాఫ్ట్‌వేర్ రూపొందించి అందిస్తుంటాడు. రాహుల్ తాను చేయగలిగిన పనులన్నింటినీ స్వయంగా చేసుకోవడానికే ఇష్టపడతాడు, ఎందుకంటే అతను తాను చేసే పనులను మరింత మెరుగ్గా చేయాలని భావిస్తాడు. ఇతరులను నమ్ముకోకుండా, తన యూనిట్‌లోని అన్ని పనులను తానే చేయాలని అనుకుంటాడు. ఫలితంగా రాహుల్ వ్యాపారవేత్త అనిపించుకుంటాడు. వ్యాపారంలో మాదిరిగా అతనికి కస్టమర్లతో ఇబ్బందులు లాంటివి ఉండవు. సెల్ఫ్ ఎంప్లాయి మైండ్‌సెట్ ఈ విధంగా ఉంటుంది. 


వ్యాపారం

వ్యాపారం చేయాలనుకునేవారు అందుకు ముందుగా వ్యాపార నమూనాను, పని చేసే విధానాన్ని సిద్ధం చేసుకోవాలి. నూతన స్టార్టప్‌ని సృష్టించాలి. ఆ తర్వాత ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుంటే వారు మీ సంస్థ కోసం పనిచేస్తారు. సంస్థ పర్యవేక్షణ బాధ్యతను వ్యాపారం చేపట్టిన వ్యక్తి చూసుకోవాల్సివుంటుంది. మంచిగా సాగే వ్యాపారంలో దాని నిర్వాహకుడు.. ఉద్యోగి కన్నా, స్వయం ఉపాధి ఏర్పరుచుకునేవారికన్నా రిలాక్స్‌గా ఉండగలుగుతాడు. వ్యాపారం అంటే వ్యాపారి ప్రారంభించిన యూనిట్‌లో ప్రతిభావంతులైన వ్యక్తులను నియమించుకోవాల్సి ఉంటుంది. వ్యాపారం చేసేవారు సమర్ధులైన వ్యక్తులను నియమించుకుంటే వ్యాపారం సాఫీగా సాగిపోతుంది. అయితే ఇందుకు సమర్థవంతమై పర్యవేక్షణ తప్పనిసరి. 

పెట్టుబడిదారు

ఏదోఒక రూపంలో అధిక ఆదాయం వస్తున్నవారు ఆ మెత్తాన్ని ఏదైనా స్టార్టప్ లేదా కంపెనీలో పెట్టుబడిగా పెట్టాలని భావిస్తారు. తద్వారా ఆ వ్యక్తి మరింత ఆదాయాన్ని సంపాదించగలుగుతారు. పెట్టుబడిదారులు తమ డబ్బును రెట్టింపు చేసేందుకు ప్రయత్నించగలుగుతారు. భవిష్యత్తులో ఏ కంపెనీ అభివృద్ధి చెందగలదో గ్రహించగలుగుతారు. ఇతరుల వ్యాపారాన్ని విశ్లేషించి, తగిన సంస్థలో డబ్బును పెట్టుబడిగా పెడతారు. ఫలితంగా వారి ఆదాయం త్వరగా పెరుగుతుంది. ఇప్పటివరకూ ఉద్యోగం, స్వయం ఉపాధి, వ్యాపారం, పెట్టుబడి విధానం మొదలైనవి తెలుసుకున్నారు కదా... మీ మనస్తత్వానికి ఏది సూటవుతుందో, ఏ పనిని మీరు సమర్థవంతంగా నెరవేర్చగలరో గ్రహించి, ఆ పనిని చేపట్టి విజయం సాధించండి. 

Updated Date - 2021-12-14T15:10:20+05:30 IST