లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగాల పేరుతో మోసం

ABN , First Publish Date - 2020-09-18T21:52:05+05:30 IST

లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడిన నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు సైబర్‌ నేరగాళ్లను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగాల పేరుతో మోసం

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడిన నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు సైబర్‌ నేరగాళ్లను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. లక్నో కేంద్రంగా జాబ్ ఫ్రాడ్ మోసాలకు ఈ ముఠా పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నౌకరీ లో అప్లోడ్ చేసిన రేజుంలను తీసుకొని ముఠా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. కెరీర్ స్టైల్ పేరుతో నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేసి నిందితులు మోసాలకు పాల్పడ్డారు. నౌకరీ వెబ్ సైట్ లో నుండి హైదరాబాద్‌కి చెందిన యువతకి ముఠా గాలం వేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. డేలాయిట్‌‌లో పని చేసిన ఒక ఉద్యోగికి మంచి జాబ్ అంటూ ఫోన్ కాల్  చేశారు. ఫేక్ లెటర్ , ఫేక్ ఇంటర్వ్యూ లు చేసి రిజిస్ట్రేషన్ ఫీ అంటూ బాధితులకు టోకరా పెట్టారు. బాధితులకు కాల్స్ చేయడానికి టెలి కాలర్స్‌ను ముఠా నియమించుకుంది.  రెండు నెలల్లో ఈ ముఠాకు బాధితురాలు 38 లక్షలు చెల్లించింది. షాను అన్సారీ, యుగంటర్ శ్రీవాస్త, తుషార్ శ్రీవాస్తలను క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.


Updated Date - 2020-09-18T21:52:05+05:30 IST