Abn logo
Sep 24 2021 @ 00:50AM

జాబ్‌మేళాలో 448 మందికి ఉద్యోగాలు

మాట్లాడుతున్న మహీధర్‌రెడ్డి

 భావవ్యక్తీకరణ తో ఉన్నత శిఖరాలు : ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి 

కందుకూరు, సెప్టెంబరు 23: భావవ్యక్తీకరణ  సామర్థ్యాన్ని పెంపొందించుకోవటంతో పాటు ఎదగాలన్న పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏడీఎస్‌ఎస్‌డీసీ ద్వారా ఎమ్మెల్యే గురువారం మెగా జాబ్‌మేళాను ఏర్పాటు చేయించారు. ఈ జాబ్‌మేళా ప్రారంభ కార్యక్రమంలోనూ, ఇంటర్వ్యూల అనంతరం ఎంపికైన వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసి ప్రసంగించారు.  ఈ జాబ్‌ మేళాకు పేరెన్నిక గన్న కంపెనీలను కూడా తీసుకొచ్చినట్లు తెలిపారు. అపెక్స్‌ సొల్యూషన్స్‌, టెక్‌ మహీంద్ర, పేటీఎం, గ్రీన్‌టెక్‌ ఇండస్ర్టీస్‌, అమరరాజా బ్యాటరీస్‌, ఫోక్స్‌కాన్‌ లాంటి దిగ్గజ కంపెనీలతో పాటు మొత్తం 27 కంపెనీలు ఈ జాబ్‌మేళాలో పాలుపంచుకున్నాయన్నారు.  భవిష్యత్తులో 50 కంపెనీలతో మెగా జాబ్‌మేళా ఏర్పాటు చేయించాలన్న లక్ష్యంతో ఉన్నట్లు వివరించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి 1628 మంది హాజరు కాగా 448 మందిని వివిధ కంపెనీలు ఉద్యోగాలకు ఎంపిక చేసుకుని నియామకపత్రాలు అందజేశారు. మరో 658 మందిని షార్ట్‌లిస్టు చేశారు. షార్ట్‌లిస్టు చేసిన వారందరికీ ఐదు రోజుల పాటు భావవ్యక్తీకరణ  నైపుణ ్యంపై శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు ఎంపికయ్యేలా చర్యలు తీసుకుంటామని  ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ నియామక పత్రాలు పొందిన పలువురు యువతీ యువకులు మాట్లాడుతూ ఇంతపెద్ద ఎత్తున జాబ్‌మేళాకు ఏర్పాట్లు చేయించి నిర్వహింపజేసిన ఎమ్మెల్యే కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎపియ్‌సయ్‌సడిసి అధికారులు,  ప్రిన్సిపాల్‌ ఎం. రవికుమార్‌, తహసీల్దార్‌ సీతారామయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌ పాల్గొన్నారు.