జనవరి 20న బైడెన్‌ను గుర్తిస్తాం: ట్విటర్‌

ABN , First Publish Date - 2020-11-22T10:02:49+05:30 IST

అమెరికా అధ్యక్షుడిగా (పోటస్‌) జో బైడెన్‌ను జనవరి 20 నుంచే అంటే ఆయన ప్రమాణస్వీకార తేదీ నుంచే గుర్తిస్తామని, ఆయన పేరిట

జనవరి 20న బైడెన్‌ను గుర్తిస్తాం: ట్విటర్‌

వాషింగ్టన్‌, నవంబరు 21: అమెరికా అధ్యక్షుడిగా (పోటస్‌) జో బైడెన్‌ను జనవరి 20 నుంచే అంటే ఆయన ప్రమాణస్వీకార తేదీ నుంచే గుర్తిస్తామని, ఆయన పేరిట ట్విటర్‌ ఖాతాను అప్పటి నుంచే యాక్టివేట్‌ చేస్తామని ట్విటర్‌ సంస్థ తెలిపింది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఓటమిని ఒప్పుకున్నా లేకున్నా జనవరి 20 నుంచి అధికారికంగా ఆయననే గుర్తిస్తామని పేర్కొంది. భారతీయ అమెరికన్‌ మహిళ మాలా అదిగాకు ఓ అరుదైన గౌరవం లభించింది. త్వరలో అమెరికా తొలి మహిళ (ఫస్ట్‌ లేడీ) కానున్న తన భార్య జిల్‌ బైడెన్‌కు విధానపరమైన సలహాదారుగా మాలను  కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ నియమించారు.  

Updated Date - 2020-11-22T10:02:49+05:30 IST