ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా బైడెన్ భారీ ఉద్దీపన ప్యాకేజీ

ABN , First Publish Date - 2021-01-16T14:42:44+05:30 IST

కొవిడ్‌ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్‌ 1.3 కోట్ల కోట్ల(1.9 ట్రిలియన్ల డాలర్ల)తో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు.

ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా బైడెన్ భారీ ఉద్దీపన ప్యాకేజీ

వాషింగ్టన్‌, జనవరి 15: కొవిడ్‌ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్‌ 1.3 కోట్ల కోట్ల(1.9 ట్రిలియన్ల డాలర్ల)తో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. అమెరికన్లకు ప్రత్యక్ష ఆర్థికసాయం, వ్యాక్సినేషన్‌, చిన్నవ్యాపార సంస్థలకు చేయూత తదితర కార్యక్రమాల కోసం ఈ నిధులను వినియోగిస్తామని బైడెన్‌ వెల్లడించారు. ప్రస్తుతం  ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆరోగ్య సంక్షోభాల నుంచి దేశాన్ని తక్షణమే బయటపడేయాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా వ్యాక్సిన్‌ను తీసుకురావడంలో ట్రంప్‌ యంత్రాంగం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. పాలన చేపట్టిన వందరరోజుల్లోనే వంద మిలియన్ల టీకాలు వేయడమే లక్ష్యంగా ఆయన కీలక ప్రతిపాదన చేశారు. ట్రంప్‌పై పెట్టిన అభిశంసన తీర్మానంపై ఈ నెల 20న సెనెట్‌లో చర్చ జరగనుంది. అదే రోజు బైడెన్‌ 20న ప్రమాణం స్వీకారం చేస్తారు.


Updated Date - 2021-01-16T14:42:44+05:30 IST