బైడెన్ బ్యాడ్ ఫర్ ఇండియా: జూనియర్ ట్రంప్

ABN , First Publish Date - 2020-10-19T16:29:07+05:30 IST

డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ భారత్‌కు అనుకూల వ్యక్తి కాదని, అతను చైనాకు మద్దతుదారు అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బైడెన్ బ్యాడ్ ఫర్ ఇండియా: జూనియర్ ట్రంప్

న్యూయార్క్: డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ భారత్‌కు అనుకూల వ్యక్తి కాదని, అతను చైనాకు మద్దతుదారు అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బైడెన్‌ ఫ్యామిలీ, ఆయన కుమారుడు హంటర్ బైడెన్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలతో తాను రాసిన 'లిబరల్ ప్రివిలేజ్' అనే బుక్ సక్సెస్ మీట్‌లో జూనియర్ ఈ వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళ్తే... నవంబర్ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం తండ్రి డొనాల్డ్ ట్రంప్ తరఫున జూనియర్ ట్రంప్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 


దీనిలో భాగంగా న్యూయార్క్‌లోని లాంగ్ ఐస్‌లాండ్‌లో భారతీయ అమెరికన్ మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించిన జూనియర్ ట్రంప్... "మాకు చైనా నుంచి ఇండియాకు పొంచి ఉన్న ప్రమాదం గురించి తెలుసు. ఈ విషయం భారతీయ అమెరికన్ల కంటే బెటర్‌గా ఇంకా ఎవరికీ తెలియదు. ఈ ఎన్నికల్లో మన ప్రత్యర్థిగా ఉన్న బైడెన్ డ్రాగన్ కంట్రీ పక్షపాతి. అతని కుమారుడు హంటర్‌కు చైనా 1.5 బిలియన్ డాలర్లు ఇచ్చింది. ఎందుకంటే అతను గొప్ప వ్యాపారవేత్త అని. కానీ అసలు విషయం అది కాదు. భవిష్యత్తులో బైడెన్‌ను కొనవచ్చని వారికి తెలుసు. అందుకే ఆయన ఎప్పుడు చైనాతో సాఫ్ట్‌గా వ్యవహారిస్తుంటారు" అని అన్నారు. "అందుకే బైడెన్ బ్యాడ్ ఫర్ ఇండియా" అని విమర్శించారు. 


ఈ కార్యక్రమంలో భారతీయ అమెరికన్లపై జూనియర్ ట్రంప్ ప్రశంసల జల్లు కురింపించారు. "భారతీయ సమాజం నా హృదయానికి చాలా దగ్గరైంది. నేను ఆ సంఘాన్ని బాగా అర్థం చేసుకున్నాను. ఇండియన్ కమ్యూనిటీ కష్టపడిపని చేస్తుంది. వారి కుటుంబ విలువలు గొప్పగా ఉంటాయి. విద్యలోనూ భారతీయ సమాజానికి ఎవరూ సాటిలేరు" అని చెప్పుకొచ్చారు. గత ఆరు నెలలుగా డెమొక్రాట్లు చేస్తున్న దాన్ని భారతీయ అమెరికన్లు గమనిస్తున్నారు. అందుకే ఈసారి కూడా ట్రంప్ గెలవడం భారతీయ సమాజానికి ఎంతో ఉపయోగకరం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సందర్భంగా జూనియర్ భారత్‌లో జరిగిన ట్రంప్ ర్యాలీ గురించి కూడా ప్రస్తావించారు. ఇక ఈ కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్ విక్టరీ ఇండియన్ అమెరికన్ ఫైనాన్స్ కమిటీ ప్రతినిధి అల్ మాసన్... ఏ అమెరికా అధ్యక్షుడు కూడా డొనాల్డ్ ట్రంప్‌లాగా భారత ప్రధాని లేదా భారతదేశాన్ని లేదా భారతీయ అమెరికన్లతో గౌరవంగా, మర్యాదగా మెలిగిన దాఖలాలు లేవు అని అన్నారు. ఈ సందర్భంగా జూనియర్ ట్రంప్‌ను ఆయన రాక్‌స్టార్‌గా అభివర్ణించారు.  

Updated Date - 2020-10-19T16:29:07+05:30 IST