మరో కీలక పదవికి భారతీయురాలిని నామినేట్ చేసిన బైడెన్ !

ABN , First Publish Date - 2021-03-27T13:39:13+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే పలువురు భారతీయ అమెరికన్లను కీలక పదవులకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 50 మందికి పైగా భారత సంతతి వ్యక్తులు బైడెన్ పరిపాలనావిభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా మరో భారతీయురాలిని మరో కీలక పదవికి నామినేట్ చేశారు బైడెన్.

మరో కీలక పదవికి భారతీయురాలిని నామినేట్ చేసిన బైడెన్ !

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే పలువురు భారతీయ అమెరికన్లను కీలక పదవులకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 50 మందికి పైగా భారత సంతతి వ్యక్తులు బైడెన్ పరిపాలనావిభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా మరో భారతీయురాలిని మరో కీలక పదవికి నామినేట్ చేశారు బైడెన్. భారత సంతతి మహిళా న్యాయవాది సీమా నందాను కార్మిక శాఖ సొలిసిటర్‌గా నామినేట్ చేశారు. ఈ మేరకు శుక్రవారం అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రకటన విడుదల చేసింది. సీమాను బైడెన్ కార్మిక శాఖ సొలిసిటర్‌గా నామినేట్ చేసినట్లు తన ప్రకటనలో పేర్కొంది. 


కాగా, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో సీమా.. అమెరికా కార్మిక శాఖలో చీఫ్ ఆఫ్ స్టాఫ్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, డిప్యూటీ సొలిసిటర్‌గా విధులు నిర్వహించారు. అలాగే అంతకుముందు ఆమె 15 ఏళ్లకు పైగా లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ అటార్నీగా వివిధ పదవుల్లో పని చేశారు. వీటిలో ఎక్కువగా ప్రభుత్వ సర్వీసులు ఉన్నాయి. ప్రస్తుతం యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్‌లోని పౌర హక్కుల విభాగంలో ఇమ్మిగ్రెంట్ మరియు ఉద్యోగుల హక్కుల విభాగానికి ఆమె నేతృత్వం వహిస్తున్నారు. కనెక్టికట్‌లో పెరిగిన సీమా.. బ్రౌన్ విశ్వవిద్యాలయం, బోస్టన్ కాలేజ్ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు.

Updated Date - 2021-03-27T13:39:13+05:30 IST