టీకా వేయించుకుంటే బీర్ ఫ్రీ.. అమెరికా ప్రజలకు మరో తాయిలం!

ABN , First Publish Date - 2021-06-03T03:52:30+05:30 IST

పెద్దలందరూ టీకా వేసుకునేలా ప్రోత్సహించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనేక చర్యలు చేపడుతున్నారు. మరో నెలలో అమెరికా ప్రజలు స్వాంత్రదినోత్సవం(జులై 4) జరుపుకోనున్న తరుణంలో అప్పటికల్లా దేశంలోని పెద్దల్లో 70 శాతం మందికి కనీసం ఒక్క డోసు టీకా అయినా అందాలని జో బైడెన్ లక్ష్యాన్ని పెట్టుకున్నారు.

టీకా వేయించుకుంటే బీర్ ఫ్రీ.. అమెరికా ప్రజలకు మరో తాయిలం!

వాషింగ్టన్: పెద్దలందరూ టీకా వేసుకునేలా ప్రోత్సహించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనేక చర్యలు చేపడుతున్నారు. మరో నెలలో అమెరికా ప్రజలు స్వాంత్రదినోత్సవం(జులై 4) జరుపుకోనున్న తరుణంలో అప్పటికల్లా దేశంలోని పెద్దల్లో 70 శాతం మందికి కనీసం ఒక్క డోసు టీకా అయినా అందాలని జో బైడెన్ లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన జూన్ నెలను ‘ప్రత్యక్ష కార్యాచరణ మాసంగా’ ప్రకటిస్తూ..పెద్దలందరూ టీకా వేసుకోవాలని వివిధ వేదికల ద్వారా పిలుపునిస్తున్నారు. అయితే.. ప్రముఖ బీర్ కంపెనీ ఆన్హైసర్ బుష్.. అమెరికా ప్రజలు టీకా తీసుకునేలా ప్రోత్సహించేందుకు మరో తాయిలం ప్రకటించింది. అధ్యక్షుడు విధించిన లక్ష్యాన్ని ప్రజలు జులై 4 కల్లా సాధిస్తే పెద్దలందరికీ ఉచితంగా ఓ బీర్ అందిస్తామని ప్రకటించింది. కరోనా నుంచి కోలుకుంటున్న అమెరికాకు తామూ పూర్తి స్థాయిలో మద్దతిస్తామని కంపెనీ సీఈఓ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.  


కాగా.. త్వరితగతిన టీకా పంపిణీ చేపట్టి దేశాన్ని కరోనా పూర్వ స్థితికి చేర్చాలని బైడెన్ అనేక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ప్రజలు టీకా వేయించుకునేలా ప్రోత్సహించేందుకు బైడెన్ ప్రభుత్వం ఇప్పటికే పలు తాయిలాలను ప్రకటించింది. నగదు బహుమతులు, జీతంతో కూడిన సెలవుల మంజురు, స్పోర్ట్స్ టోర్నమెంట్లకు టిక్కెట్లు ఇవ్వడం వంటి అనేక ప్రోత్సాహాకాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉచిత బీర్ తాయిలం ప్రజల ముందుకు వచ్చింది. ఇక తాజా లెక్కల ప్రకారం..అమెరికాలోని పెద్దల్లో ఇప్పటివరకూ దాదాపు 63 శాతం మంది కనీసం ఒక్క డోసును పొందారు. 133.6 మిలియన్ల మందికి పూర్తి స్థాయిలో(రెండు డోసులు) టీకాలు అందాయి. ప్రస్తుతం అక్కడ రోజుకు 6 లక్షల టీకా డోసులను ఇస్తున్నారు. 

Updated Date - 2021-06-03T03:52:30+05:30 IST