Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరోనాపై పోరులో భారత్‌కు పూర్తి మద్దతు: బైడెన్

భారత్ కోసం మనం.. మన కోసం ఇండియా: బైడెన్

వాషింగ్టన్: మహమ్మారి విజృంభణతో అతలాకుతలం అవుతున్న భారత్‌కు అమెరికా సాయం ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అధ్యక్షుడు జో బైడెన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. భారతదేశానికి అగ్రరాజ్యం చేస్తున్న సాయానికి కృతజ్ఞతలు చెప్పానని, భారత్‌ చేపట్టిన వ్యాక్సిన్‌ మైత్రి గురించి వివరించానన్నారు మోదీ. దీనిపై బైడెన్ ట్విటర్ వేదికగా స్పందించారు. కరోనాపై పోరులో భారత్‌కు అమెరికా అన్ని విధాలుగా అండగా ఉంటుంది. మన కోసం భారత్ ఉన్నప్పుడు, వాళ్ల కోసం మనం ఉండాలి." అని బైడెన్ ట్వీట్ చేశారు. ఇక భారత్‌కు కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తయారీ కోసం ముడిసరుకును, ఆక్సిజన్‌, పీపీఈ, ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను అందజేస్తామని అగ్రరాజ్యం ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ఇండియాకు అవసరమైన సాయాన్ని తక్షణమే అందిస్తామని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ కూడా ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. 


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement