Abn logo
Sep 21 2021 @ 21:38PM

అఫ్ఘాన్‌పై కీలక వ్యాక్యలు చేసిన జో బైడెన్

న్యూయార్క్: అఫ్ఘనిస్తాన్‌లోని మహిళలు, బాలికలు హింసలకు బెదిరింపులకు గురవుతున్నారని, ఇలాంటివి లేకుండా వారి కలల్ని కొనసాగించుకునే హక్కులను కాపాడాలని, సమర్ధించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. తాజాగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 76వ సమావేశం సందర్భంగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


ఇంకా బైడెన్ మాట్లాడుతూ ‘‘తీవ్రవాదంపై అమెరికా తనను తాను కాపాడుకుంటూనే దాని మిత్రదేశాలను కూడా కాపాడుకుంటుంది. అఫ్ఘానిస్తాన్ ప్రజలను ఎలా కాపాడుకోవాలో తెలియజేసే తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించింది. తాలిబన్ల అంచనాలను నిర్దేశించింది. మనమంతా కలిసి అఫ్ఘాన్‌లో ఉన్న ప్రజలను కాపాడాలి. ఎలాంటి హింసకు, బెదిరింపులకు లోను కాకుండా అక్కడి మహిళలు, పిల్లలు వారి కలల్ని కొనసాగించే హక్కులను మనం కాపాడాలి’’ అని అన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption