సచిన్‌ను అధిగమిస్తాడు
ABN , First Publish Date - 2021-01-27T06:47:03+05:30 IST
టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించే సత్తా జో రూట్‌కు ఉందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్ బాయ్‌కాట్ ధీమా వ్యక్తం చేశాడు...
లండన్: టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించే సత్తా జో రూట్‌కు ఉందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్ బాయ్‌కాట్ ధీమా వ్యక్తం చేశాడు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన రెండు టెస్టుల్లో రూట్ 426 పరుగులతో అదరగొట్టాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ ఉండగా రెండో టెస్టులో 186 పరుగుల వద్ద రనౌటయ్యాడు. ‘ఇంగ్లండ్ తరఫున గోవర్, పీటర్సన్, నాకన్నా ఎక్కువ పరుగులు సాధించడం గొప్ప కాదు.. రూట్‌కు 200 టెస్టులు ఆడే సామర్థ్యంతో పాటు సచిన్ కంటే ఎక్కువ రన్స్ చేసే సత్తా ఉంది’ అని బాయ్‌కాట్ విశ్వాసం వ్యక్తం చేశాడు. 30 ఏళ్ల ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ ఇప్పటికి 99 టెస్టుల్లో 8,249 పరుగులు సాధించగా సచిన్ 15,921 రన్స్‌తో టాప్‌లో ఉన్నాడు.