తస్లిమాకు జొఫ్రా ఆర్చర్ కౌంటర్!

ABN , First Publish Date - 2021-04-07T16:30:41+05:30 IST

ఇంగ్లండ్‌ క్రికెటర్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాడు మొయిన్‌ అలీపై బంగ్లాదేశ్‌ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

తస్లిమాకు జొఫ్రా ఆర్చర్ కౌంటర్!

ఇంగ్లండ్‌ క్రికెటర్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాడు మొయిన్‌ అలీపై బంగ్లాదేశ్‌ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. తస్లీమా ట్వీట్‌పై నెటిజన్లు, క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. తస్లిమా ట్వీట్‌ను ఇంగ్లండ్ ఆటగాడు జొఫ్రా ఆర్చర్ రీ-ట్వీట్ చేస్తూ `మీరు బాగానే ఉన్నారా? నాకు అలా అనిపించడం లేద`ని కామెంట్ చేశాడు. 


మొయిన్ అలీ క్రికెటర్‌ కాకపోయుంటే.. కచ్చితంగా ఉగ్రవాది అయ్యుండేవాడని తస్లిమా ట్వీట్‌ చేశారు. ఐపీఎల్‌లో చెన్నై జట్టు జెర్సీపై మద్యం కంపెనీ లోగో ఉన్నందున.. దాని స్థానంలో మరో జెర్సీ ధరించేందుకు తనకు అనుమతివ్వాలని మొయిన్‌ అలీ సీఎస్‌కే యాజమాన్యాన్ని కోరినట్టు రెండ్రోజుల క్రితం వార్తలొచ్చాయి. ఈ వార్తపై తస్లీమా స్పందిస్తూ.. `మొయిన్‌ అలీ క్రికెటర్ కాకపోయుంటే.. కచ్చితంగా సిరియా వెళ్లి ఐసిస్‌ ఉగ్రవాద సంస్థలో చేరేవాడ`ని తస్లిమా ట్వీట్ చేసింది. కాగా.. జెర్సీపై లోగోను తొలగించాలంటూ మొయిన్‌ అలీ తమను కోరలేదని చెన్నై జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్‌ స్పష్టం చేశారు. 




Updated Date - 2021-04-07T16:30:41+05:30 IST