Abn logo
Sep 19 2021 @ 01:12AM

జోగి రమేశను వెంటనే అరెస్టుచేయాలి

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

రామగిరి, సెప్టెంబరు 18: ప్రతిపక్షనేత, మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగిరమేశను వెం టనే అరెస్టు చేయాలని టీ డీపీ మండల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశా రు. వారు శనివారం టీడీపీ స్థానిక కార్యాలయంలో విలే కరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.  చంద్రబాబునాయుడు ఇంటిపై ఎమ్మెల్యే జోగిరమేశ, అతడి అనుచరులు  చేసిన దాడిని  తీవ్రంగా ఖండించారు. జడ్‌క్యాటగిరి ఉన్న నాయకుడి ఇంటిపై అధికార పార్టీ నాయకులు ఎలా దాడి చేస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్‌జగన అండదండలతోనే వారు అరాచకాలు సాగిస్తున్నారని, ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీనాయకులు శ్రీధర్‌నాయుడు, తిమ్మాపురం మాజీసర్పంచ ముత్యాలప్ప, ఆదినా రాయణ, గంగంపల్లి మహేంద్ర, గంగాధర్‌ పాల్గొన్నారు.

చంద్రబాబు ఇంటిపై దాడి పిరికిపందల చర్య

: టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆలం నరసానాయుడు

నార్పల,సెప్టెంబరు18 :  టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇంటిపై దాడి చేయడం పిరికిపందల చర్య అని  టీడీపీ రాష్ట్ర కార్య దర్శి ఆలం నరసానాయుడు తీవ్రంగా ఖండించారు.  ఆయన శనివారం ఆంధ్రజ్యోతితో మా ట్లాడుతూ... ఎమ్మెల్యే జోగి రమేష్‌ రౌడీమూకలను వెంటేసుకుని వీధి రౌడీలా చంద్రబాబు ఇంటిపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో సీఎం జగన ఒక నియం తలా వ్యవహరిస్తూ దౌర్జన్యకాండ చేస్తున్నారన్నారు. చంద్రబాబు జొలికొస్తే వైసీపీ నాయకులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

  దుర్మార్గమైన చర్య : దండు శ్రీనివాసులు

శింగనమల, సెప్టెంబరు18 : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇం టిపై ఎమ్మెల్యే జోగిరమేష్‌ రౌడీలతో రాళ్ల దాడి చేయడం దుర్మార్గమైన చర్యని టీడీపీ మండల సీనియర్‌ నాయకులు దండు శ్రీనివాసులు మండిపడ్డారు. ఇందుకు వైసీపీ తగినమూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వైసీపీ మంత్రులు ఎన్నిసార్లు  ఇప్పటికైనా చంద్రబాబునాయుడు, లోకేష్‌ను బూతులు మాట్లాడటం మానుకొని సంస్కారం నేర్చుకో వాలన్నారు. వెంటనే చంద్రబాబు నాయుడుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.