పోలీసు అమరవీరులకు జోహార్లు: ఎస్పీ

ABN , First Publish Date - 2021-10-26T06:10:19+05:30 IST

విధుల్లో అమరులైన పోలీసులకు జో హార్లు అని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప పేర్కొన్నారు. పట్టణంలోని అశోక్‌పిల్లర్‌ వద్ద సోమవారం ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల భారీ సంస్మరణ సభకు ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

పోలీసు అమరవీరులకు జోహార్లు: ఎస్పీ
మాట్లాడుతున్న ఎస్పీ ఫక్కీరప్ప

తాడిపత్రి టౌన, అక్టోబరు 25: విధుల్లో అమరులైన పోలీసులకు జో హార్లు అని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప పేర్కొన్నారు. పట్టణంలోని అశోక్‌పిల్లర్‌ వద్ద సోమవారం ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల భారీ సంస్మరణ సభకు ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ వివిధ ఘటనల్లో జిల్లాకు చెందిన 8మంది పోలీసు అధికారులు, ముగ్గురు హోంగార్డులు విధుల్లో అమరులయ్యారన్నారు. శాంతిభద్రతల కో సం ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీసుల సేవలు మరువలేనివన్నా రు. వారి జ్ఞాపకార్థం ఏటా పోలీసు అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. అనంత రం అమరులైన పోలీసుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, సెల్యూట్‌ చే శారు. వారి కుటుంబ సభ్యులకు మెమెంటోలతో పాటు శాలువాలు కప్పి సన్మానించారు. 


 అంతకుమునుపు పట్టణ పోలీ్‌సస్టేషన నుంచి గాంధీసర్కిల్‌, వైఎ్‌సఆర్‌ సర్కిల్‌, బండామసీదు మీదుగా అశోక్‌పిల్లర్‌ వరకు వివిధ పార్టీ ల నాయకులు, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బం ది, విద్యార్థులు, వివిధ కులసంఘాలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు కొవ్వొత్తులను చేతబూని, అశ్వాలతో వాయిద్యాలనడుమ ర్యాలీ నిర్వహించా రు. చిన్నారులు ర్యాలీలో పాల్గొని స్కేటింగ్‌ చేయడం అందరిని ఆకట్టుకుం ది. సంస్మరణ సభ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏఎస్పీ ప్రసాద్‌, డీఎస్పీ చై తన్య, కమిషనర్‌ నరసింహప్రసాద్‌, సబ్‌ డివిజనలోని సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-10-26T06:10:19+05:30 IST