Abn logo
Sep 21 2020 @ 12:04PM

జాన్ అబ్రహం `సత్యమేవ జయతే-2`!

Kaakateeya

బాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు జాన్ అబ్రహం తన కొత్త సినిమా పోస్టర్‌ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. నాగలి పట్టుకుని జాతీయ పతాక రంగులతో కూడిన జాన్ అబ్రహం పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. 


`గంగా నది ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో.. అక్కడ రక్తం కూడా త్రివర్ణ పతాకాన్ని పోలి ఉంటుంద`ని జాన్ పేర్కొన్నాడు. వచ్చే ఏడాది మే 12న `సత్యమేవ జయతే-2` విడుదల కాబోతోందని తెలిపాడు. 2018లో విడుదలైన `సత్యమేవ జయతే`కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో దివ్యా ఖోస్లా కుమార్, అమైరా దస్తూర్, మనోజ్ బాజ్‌పాయ్ తదితరులు నటిస్తున్నారు.  

Advertisement
Advertisement
Advertisement