Abn logo
May 5 2021 @ 00:20AM

దళిత యువతి న్యాయ పోరాటానికి జేఏసీ ఏర్పాటు

ములుగుటౌన్‌, మే 4: ప్రేమ పేరుతో మోసపోయిన దళిత యువతికి  న్యాయం కోసం పోరాడేందుకు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలతో ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ)ని ఏర్పాటు చేశారు. ములుగులో మంగళవారం నిర్వహించిన సమా వేశంలో ఈ మేరకు కార్యవర్గాన్ని ఖరారు చేశారు. చైర్మన్‌గా మొగుళ్ల భద్రయ్య, కన్వీనర్‌గా కొట్టెపాక శ్రీనివాస్‌, గౌరవ అధ్యక్షుడిగా గుగ్గిళ్ల సాగర్‌, కో కన్వీనర్లుగా జన్ను రవి, ముంజాల బిక్షపతి గౌడ్‌, సైనవేని సరోజన, గుండాల రఘు, నర్సయ్య, కొండమల్ల శ్రావణ్‌, కళ్లెపు అబ్రహం, కలువల భద్రయ్య, కుమ్మరి సాగర్‌ను ఎన్నుకున్నారు. 

Advertisement
Advertisement