Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతా: పెద్దిరెడ్డి

హుజురాబాద్: శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు మాజీమంత్రి పెద్దిరెడ్డి ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతానని తెలిపారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా.. శిరసావహిస్తానని చెప్పారు. మాజీమంత్రి ఈటల రాజేందర్ దేవాలయ భూములు ఆక్రమించారనే ఆరోపణలు వచ్చాయని, కోర్టులో నిజమని తేలితే బీజేపీ ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. బీజేపీ నాయకుల విధానాలు నచ్చక బయటకు వచ్చానని తెలిపారు. దుబ్బాక, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఇంచార్జీగా పనిచేశానని, అయితే హుజురాబాద్ లో ఇంచార్జీగా నియమించలేదని పెద్దిరెడ్డి వాపోయారు. 


ఇటీవల పెద్ది‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి పెద్దిరెడ్డి భంగపడ్డారు. బీజేపీలో ఈటల రాజేందర్ చేరికను ఆయన వ్యతిరేకించారు. రాజేందర్ బీజేపీలో చేరినప్పటి నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీలో ఇమడలేకపోతున్నామనే భావనలో పెద్దిరెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారని సమాచారం. టీడీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి మంత్రిగా పనిచేశారు. కరీంనగర్ జిల్లాలో ఆయన బలమైన నాయకుడిగా ఒక వెలుగు వెలిగారు. ప్రస్తుతం బీజేపీలో ఆయన కొంత ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే బీజేపీకి గుడ్ బై చెప్పారనే ప్రచారం జరుగుతోంది. 

Advertisement
Advertisement