టీడీపీలో చేరడం అభినందనీయం

ABN , First Publish Date - 2021-10-27T06:17:51+05:30 IST

మండల వైసీపీ అధ్యక్ష పదవిని విడనాడి తిరిగిసొంతపార్టీ టీడీపీలో చేరడంపై మాజీ జడ్పీటీసీ బొల్లా మాల్యాద్రిచౌదరిని నారా లోకేష్‌ అభి నందించారు.

టీడీపీలో చేరడం అభినందనీయం
లోకేష్‌ను అభినందిస్తున్న బీఎంసీ

పామూరు, అక్టోబరు 26: మండల వైసీపీ అధ్యక్ష పదవిని విడనాడి తిరిగిసొంతపార్టీ టీడీపీలో చేరడంపై మాజీ జడ్పీటీసీ బొల్లా మాల్యాద్రిచౌదరిని నారా లోకేష్‌ అభి నందించారు. టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పేర్కొన్నట్లు బీఎంసీ తెలిపారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో నారా లోకే్‌షను కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డితో కలిసి  టీడీపీ మండల  అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లుతో సమన్వయం చేసుకుంటూ వైసీపీ అవినీతి అక్రమాలపై పోరాడుతూ ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా లోకేష్‌ను కలిసి సన్మానించిన వారిలో మాజీ ఎంపీపీ గుంటుపల్లి దశరధ రామయ్య, లక్ష్మీనర్సాపురం ఎంపీటీసీ సభ్యులు బొల్లా నరసింహారావు, పామూరు 1వ మాజీ ఎంపీటీసీ ఇర్రి కోటిరెడ్డి తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-10-27T06:17:51+05:30 IST