గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-07-29T05:06:49+05:30 IST

గొల్లప్రోలు రూరల్‌, జూలై 28: పట్టాలు తీసుకున్న లబ్ధిదారులు గృహాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (హౌసింగ్‌) భార్గవతేజ సూచించారు. గొల్లప్రోలు మండలం చినజగ్గంపేట గ్రామంలోని ఇళ్లస్థలాల లేఅవుట్‌ను, గృహ నిర్మాణాలను ఆయన బుధవారం ప

గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి
చినజగ్గంపేటలో లబ్ధిదారులతో మాట్లాడుతున్న జేసీ

గొల్లప్రోలు రూరల్‌, జూలై 28: పట్టాలు తీసుకున్న లబ్ధిదారులు గృహాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (హౌసింగ్‌) భార్గవతేజ సూచించారు. గొల్లప్రోలు మండలం చినజగ్గంపేట గ్రామంలోని ఇళ్లస్థలాల లేఅవుట్‌ను, గృహ నిర్మాణాలను ఆయన బుధవారం పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. కాలనీల్లో అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తామని హామీఇచ్చారు. అధికారులు, ఇంజనీరింగ్‌ ఆసిస్టెంట్లతో సమీక్ష నిర్వహించారు. అనంతరం పిఠాపురం మండలం కుమారపురంలో హౌసింగ్‌ లేఅవుట్‌ను పరిశీలించారు. గొల్లప్రోలు తహశీల్దార్‌ వి.అమ్మా జీ, ఎంపీడీవో హరిప్రియ, హౌసింగ్‌ డీఈ నాగలక్ష్మి, ఏఈలు సత్యనారాయణ, సూర్యనారాయణ, రమణ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-29T05:06:49+05:30 IST