ప్రమాదకర ప్రాంతాలను గుర్తించాలి

ABN , First Publish Date - 2020-12-01T06:22:27+05:30 IST

జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించాలని జాయింట్‌ కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌.. సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి రహదారి భ ద్రత కమిటీ సమావేశం నిర్వహించారు.

ప్రమాదకర ప్రాంతాలను గుర్తించాలి

అధికారులకు జేసీ నిశాంత్‌కుమార్‌ ఆదేశం

అనంతపురం, నవంబరు30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించాలని జాయింట్‌ కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌.. సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి రహదారి భ ద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ముందుగా డీటీసీ శివరాంప్రసాద్‌ గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను జేసీ దృష్టికి తీసుకొచ్చారు. వాటిపై జేసీ సమీక్షించారు. అనంతపురంలోని సర్వజనాస్పత్రి, పెనుకొండలో ట్రామాకేర్‌ సెంటర్ల ఏర్పాటుకు నిధుల మంజూరు నిమిత్తం మరోసారి వైద్యశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాయాలని సూచించారు. జిల్లాలో పాఠశాలలు ప్రారంభించిన నేపథ్యంలో బస్సులు, ఆటోల్లో ఎక్కువ మంది విద్యార్థులతో వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ మేరకు కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలతోపాటు తల్లిదండ్రులకు విషయాన్ని చేరవేసే విధంగా విద్యాశాఖ సర్క్యులర్‌ జారీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ కేవీఆర్‌కే ప్రసాద్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ నాగరాజు, జిల్లా వైద్యాధికారి కామేశ్వరప్రసాద్‌, డీసీహెచ్‌ఎ్‌స డా.రమే్‌షనాథ్‌, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌ రామస్వామినాయక్‌, డీఈఓ శామ్యూల్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ మూర్తి, అనంతపురం, హిందూపురం ఎంవీఐలు వరప్రసాద్‌, రమేష్‌, ఆర్‌అండ్‌బీ ఈఈలు సంజీవయ్య, రాజగోపాల్‌, లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు సుభా్‌షచంద్రబోస్‌, ఆర్డీటీ చైర్మన్‌ తిప్పేస్వామి, ఆర్టీసీ ఆర్‌ఎం సుమంత్‌, రవాణాశాఖ ఏఓ వెంకట్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-01T06:22:27+05:30 IST