కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీకి కరోనా!

ABN , First Publish Date - 2020-08-15T04:19:34+05:30 IST

దేశంలో కరోనా విజృంభణ గురించి ఎప్పటి కప్పుడు ప్రకటనలు చేసిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్‌కు కరోనా సోకింది.

కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీకి కరోనా!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ గురించి ఎప్పటి కప్పుడు ప్రకటనలు చేసిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా తనకు కరోనా సోకినట్లు తెలియజేశారు. తాను వెంటనే హోమ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోతున్నానని చెప్పారు. ‘మిత్రులు, సహోద్యోగులు అందరూ జాగ్రత్తలు తీసుకోండి. హెల్త్ టీమ్ వచ్చి కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తుంది. త్వరలోనే మళ్లీ అందర్నీ కలుసుకుంటానని భావిస్తున్నా’ అని లవ్ అగర్వాల్ ట్వీట్ చేశారు.

Updated Date - 2020-08-15T04:19:34+05:30 IST